45 శాతానికి చేరనున్న DA

న్యూఢల్లీ, ఆగస్టు 9, (ఇయ్యాల తెలంగాణ );కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 45శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఓ గుడ్‌? న్యూస్‌? అందే అవకాశం ఉంది! డీఏ (డియర్‌?నెస్‌? అలోవెన్స్‌?)ను 45శాతానికి పెంచేందుకు కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఈ నిర్ణయంతో కోటి కన్నా ఎక్కువమంది ఉద్యోగులు, పింఛనుదారులు లబ్ధిపొందుతారని సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.లేబర్‌? బ్యూరో ప్రతినెల విడుదల చేసే సీపీఐ`ఐడబ్ల్యూ (కన్జ్యూమర్‌? ప్రైజ్‌? ఇండెక్స్‌?` ఇండస్ట్రియల్‌? వర్కర్స్‌?) ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏను నిర్ణయిస్తుంది కేంద్రం. ఇందుకోసం ప్రత్యేక ఫార్ములా ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 42శాతంగా ఉంది. త్వరలోనే ఇది 45శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే 3 పర్సెంటేజ్‌? పాయింట్లు పెంచినట్టు అవుతుంది.ఎప్పుడు ప్రకటించినా.. సంబంధిత డీఏ హైక్‌?, 2023 జులై 1 నుంచే అమల్లోకి వస్తుంది. చివరిగా.. 2023 మార్చ్‌?లో డీఏను హైక్‌? చేసింది కేంద్రం. ఇది 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని వెల్లడిరచింది. నాడు.. 4 పర్సెంటేజ్‌? పాయింట్లను పెంచింది.నిత్యం పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులకు తరచూ డీఏను పెంచుతుంటాయి ప్రభుత్వాలు. డీఏ పెంపునకు సంబంధించి, కేంద్ర ఆర్థికశాఖ లోని ఖర్చుల విభాగం (ఎక్స్‌?పెండీచర్‌? డిపార్ట్‌?మెంట్‌?).. ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని ఓ ప్రదిపాదన చేస్తుంది. ఆ ప్రతిపాదన కేంద్ర కేబినెట్‌? ముందుకు వెళుతుంది. కేబినెట్‌? ఆమోద ముద్ర వేసిన తర్వాత.. డీఏ హైక్‌? అమల్లోకి వస్తుంది.ఈసారి డీఏను 45శాతానికి పెంచుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆల్‌? ఇండియా రైల్వేమెన్‌? ఫెడరేషన్‌? జనరల్‌? సెక్రటరీ శివ గోపాల్‌? మిశ్రా స్పందించారు’’2023 జూన్‌?కు చెందిన సీపీఐ డేటాను జులై 31న పబ్లీష్‌? చేశారు. ఈసారి డీఏను 4 పర్సెంటేజ్‌? పాయింట్లు పెంచాలని మేము డిమాండ్‌? చేస్తున్నాము. కానీ 3 పర్సెంటేజ్‌? పాయింట్లు ఉండొచ్చని తెలుస్తోంది. అంటే డీఏ 45శాతానికి చేరుతుంది,’’ అని మిశ్రా అన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....