550 కాంతి సంవత్సరాల దూరంలో త్రినక్షత్ర కూటమి.. ఫోటో రిలీజ్‌ చేసిన NASA

న్యూయార్క్‌ మే 16 (ఇయ్యాల తెలంగాణ) :  హబుల్‌ టెలిస్కోప్‌కు ఆకాశ అద్భుతం చిక్కింది. విరజిమ్ముతున్న నెబులా నుంచి త్రి నక్షత్ర కూటమి ఉద్భవించింది. ఆ హెచ్‌పీ టావూ ఫ్యామిలీలో ఓ యువ నక్షత్రం కూడా ఉన్నట్లు నాసా పేర్కొన్నది. సుమారు 550 కాంతి సంవత్సరాల దూరంలో ఆ నక్షత్రం జన్మించినట్లు నాసా వెల్లడిరచింది. హెచ్‌పీ టావూ నక్షత్ర కుటుంబంలో హెచ్‌పీ టావూ, హెచ్‌పీ టావూ జీ2, హెచ్‌పీ టావూ జీ3 నక్షత్రాలు ఉన్నాయి. ఈ మూడిరటిలో మిళమిళలాడుతున్న హెచ్‌పీ టావూ చాలా చిన్న వయసున్న నక్షత్రం. సూర్యుడి తరహాలో ఉద్భవిస్తున్న ఈ నక్షత్రం వయసు 10 మిలియన్ల సంవత్సరాలు ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మన సూర్యుడి సుమారు 4.6 బిలియన్ల ఏళ్ల క్రితం పుట్టిన విషయం తెలిసిందే.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....