6జీలే మాకు ప్రాణం

కరీంనగర్‌, అక్టోబరు 23, (ఇయ్యాల తెలంగాణ ); విజయ దశమి సందర్భంగా కరీంనగర్‌ మాజీ పార్లమెంట్‌ సభ్యులు పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని తన నివాసంలో జమ్మిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రజలందరికీ దుర్గామాత ఆశీస్సులతో విజయం కలగాలని ఆశిస్తూ, హుస్నాబాద్‌ లో మార్పు కోరుకుంటున్న నియోజకవర్గ ప్రజలకు విజయం కలగాలనే వారందరి ఆకాంక్షలు నెరవేరాలని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అయినందున, రాష్ట్ర ప్రజలందరూ కోరుకునే మార్పులో విజయం వరించాలని అమ్మవారిని వేడుకుంటూ, ఈ విజయదశమి రోజు ఇక్కడ జరుపుకున్న జమ్మి పూజ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలే మా ఆయుధంగా చేస్తున్న పోరాటంలో ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఆదరిస్తారని అన్నారు.మాకు సంపూర్ణ విజయం కలిగిస్తారని మా ఆయుధమే.. మా ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీల హావిూలను అమలు చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను అన్ని రంగాలలోని శ్రామిక న్యాయం చేస్తుందని తెలిపారు. ఈ మేరకు గ్యారంటీ కార్డులు రాని ప్రజలు స్థానిక కాంగ్రెస్‌ పార్టీ విూద ఆశ్రయించి గ్యారెంటీ కార్డులు పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.

కాల్పులు జరిపి పూజలు

ఆదిలాబాద్‌ జిల్లా ఐదు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి విజయ దశమి పూజను జిల్లా ఎస్పి ఉదయ్‌ కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. పోలీసు సాయుధ భాండాగారంను శాస్త్రృత్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ లోని ఆయుధ భాండాగార మందిరంలో పోలీసు అధికారులు వేద పండితుల శాస్త్రక్తాల మధ్య సాంప్రదాయబద్ధంగా దుర్గామాత సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి శవిూ చెట్టు వద్ద పూజలు నిర్వహించి, విజయానికి చిహ్నంగా ఆకాశం వైపు తుపాకితో ఐదు రౌండ్లని కాల్చి విజయదశమిని ప్రారంభించారు.అనంతరం సాయుద పోలీస్‌ విభాగంలో పనిచేస్తున్న డాగ్‌ స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌ టీం, పోలీసు వాహనాలు తదితర విభాగాల్లో సిబ్బందితో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు ఘనంగా విజయదశమి ఉత్సవాలను జరుపుకోవాలని జిల్లాలో ప్రశాంత వాతావరణ నెలకొల్పడానికి పోలీస్‌ శాఖ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌ శాఖలో ఆయుధాలు కీలకపాత్ర పోషిస్తాయని, సాయిధ బలగాల సంరక్షణలో భద్రపరుస్తారని తెలిపారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....