6వరల్డ్‌ టాప్‌ 5 టెక్‌ కంపెనీలకు హైదారాబాద్‌ నిలయం

CM కేసీఆర్‌, మంత్రి కెటిఆర్‌ ఆధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందింది

 

తెలంగాణ యువతకు మంచి నైపుణ్యాలు ఉన్నాయి.

ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు

గచ్చిబౌలి లో అస్పైర్‌ సాఫ్ట్వేర్‌ సొల్యూషన్స్‌ సేవలను మంత్రి హరీశ్‌ రావు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ అరికెపుడి గాంధీ ,హుస్నాబాద్‌ ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌, ఫారెస్ట్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌  ప్రతాప్‌ రెడ్డి పాల్గొన్నారు.

మంత్రి  మాట్లాడుతూ ఫ్లోరిడాలోని  ఆధారిత సాంకేతిక సేవల సంస్థ అయిన ఫోనిక్స్‌ టెక్నాలజీస్‌  లో భాగంగా ఇక్కడ అస్పైర్‌ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు.

తెలుగు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు, అందుకు అనుగుణంగా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం మంచి విషయం.  మూడేళ్లలో 3000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉండేలా విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాను. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశం లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ  పెట్టుబడులకు హైదరాబాద్‌ ను నిలయంగా మార్చాయి. మంత్రి కేటీఆర్‌ అధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచంలోని ఐటీ సంస్థలకు అగ్రగామి గమ్యస్థానంగా హైదరాబాద్‌ ఉన్నది. ప్రపంచంలోని అతి పెద్ద బహుళజాతి సంస్థలు తమ విస్తరణ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటుచేశాయి.  తెలంగాణ యువతకు ఎంతో టాలెంట్‌ ఉంది. నూతన అవకాశాలు అనేకం ఉన్నాయి.  ఆవిష్కరణ విషయంలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నట్లు మొన్న విడుదలైన నీతి ఆయోగ్‌ సూచి వెల్లడిరచింది.  ఆవిష్కరణల సుచీలో కర్ణాటక, తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో ఉంటే… గుజరాత్‌, బీహార్‌ 14, 15 స్థానాల్లో ఉన్నాయి. డబుల్‌ ఇంజన్‌ గ్రోత్‌ రాష్ట్రాలు వెనక బడ్డాయి. ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడకు క్యూ కడుతున్నాయి. ఆవిష్కరణల్లో అగ్ర స్థానంలో ఉంటున్నాం అంటే..ఇదంతా ఎలా సాధ్యమవుతుంది?. ఒక లక్ష్యంతో పని చేయడం వల్ల. ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడి పౌరులకు కల్పించడం వల్ల. ఇన్నోవేషన్‌,న్ఫ్ఫ్రాస్ట్ట్రక్చర్‌, ఇంక్లూజివ్‌ గ్రోత్‌.. విధానానికి తోడు, అద్భుతమైన ప్రభుత్వ విధానాలు శాంతి భద్రతల నిర్వహణ,రాజకీయ సుస్థిరత, ఇక్కడి భౌగోళిక వాతావరణం వల్ల సాధ్యమైంది.  అయితే అవకాశాలను అందుకోవడంలో యువత ముందు ఉండాలి. చేసే పనిలో నిబద్దత, అనుకున్న లక్ష్యం స్పష్టత ఉంటే అత్యున్నత శిఖరాలకు ఎదగవచ్చు.  అస్పైర్‌  సాఫ్ట్వేర్‌ సొల్యూషన్స్‌ సేవలు ప్రారంభించడం సంతోషకరం. విూరు మరింత విస్తరించి, ఇక్కడి యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్ననని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....