6G నీ నమ్ముకున్న కాంగ్రెస్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19, (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణ కాంగ్రెస్‌ స్పీడ్‌ పెంచింది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఇప్పటికే రేసులో ముందున్న కాంగ్రెస్‌ పార్టీ ఇక వెనక్కు తగ్గేందుకు ఇష్టపడటం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. వరసగా రెండుమార్లు విఫలమవ్వడంతో ఈసారి గోల్‌ కొట్టాల్సిందేనన్న కసి ప్రతి కాంగ్రెస్‌ నేత, కార్యకర్తలో కనపడుతుంది. ఆ దిశగానే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి నిన్న తుక్కుగూడలో జరిగన కాంగ్రెస్‌ సభ విజయవంతమయిందనే చెప్పాలి. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. పార్టీ జాతీయ నేతలందరూ కొలువుదీరిన ఈ సభలో శాసనసభ ఎన్నికలే టార్గెట్‌ గా అనేక హావిూలను ఇచ్చింది. గ్యారంటీ కార్డును ప్రజల ముందు ఉంచింది. తాము అధికారంలోకి వచ్చి తొలి కేబినెట్‌ సమావేశంలోనే గ్యారంటీ కార్డును అమలు చేస్తామని స్వయంగా రాహుల్‌ గాంధీ హావిూ ఇవ్వడం ఈ సందర్భంగా విశేషం. అన్ని రంగాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ఆరు హవిూలతో గ్యారెంటీ కార్డును రూపొందించారు.మహిళలు, రైతులు, యువత, అమరవీరుల కుటుంబాలతో పాటు విద్యుత్తు, వ్యవసాయ రంగంపై వరాల వర్షం కురిపించారు. నిజానికి ఈ హావిూలన్నీ అమలు అయితే అనేక మంది పేదలు సంతోషం వ్యక్తం చేస్తారు. కర్ణాటక తరహాలోనే ఇక్కడ కూడా గ్యారంటీ కార్డును అమలు చేస్తామని, తమను నమ్మమని కాంగ్రెస్‌ అగ్రనేతలు మూకుమ్మడిగా కోరడం ఇందులో విశేషం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీతో పాటు రాహుల్‌ గాంధీ కూడా ఈ సభకు హాజరై గ్యారంటీ కార్డు విడుదల చేయడం సభకు మరింత శోభను తెచ్చిపెట్టింది… కాంగ్రెస్‌ సభ పూర్తిగా సక్సెస్‌ కావడంతో పార్టీ నేతలతో పాటు శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. నేటి నుంచి గ్యారంటీ కార్డును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రచార కార్యక్రమం చేపడుతున్నాయి. ప్రజల్లో తమ అగ్రనేతలు ఇచ్చిన హావిూలను తీసుకెళ్లి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ నేతలున్నారు. నియోజకవర్గాల్లో ఈ పర్యటనలు నేటి ప్రారంభం కానున్నాయి. ఈ గ్యారెంటీ నమ్మితే తమ గవర్నమెంట్‌ గ్యారెంటీ అని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఆ దిశగానే త్వరగానే అభ్యర్థుల ఎంపిక కూడా ఉంటుందని, తొలిదశలో నలభై మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ హైకమాండ్‌ విడుదల చేయనుందని పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. మరి ఈసారి హస్తవాసి ఎలా ఉంటుందో? చూడాలి మరి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....