70 ఏళ్లు… 70 అడుగుల వినాయకుడు

హైదరాబాద్‌, జూలై 11 (ఇయ్యాల తెలంగాణ );వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

సెప్టెంబరు 07 శనివారం వినాయక చవితి. విగ్రహాల తయారీ జోరందుకుంటోంది. ఊరూరా కొలువుతీరే మండపాలన్నీ ప్రత్యేకమే అయినా.. ఖైరతాబాద్‌ గణేష్‌ సందడే వేరు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్‌ వినాయకుడికి విగ్రహం ఈ ఏడాది 70 అడుగులు రూపుదిద్దుకోనుంది. నిర్జల్‌ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే కర్రపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సరిగ్గా వినాయకచవితికి వారం ముందు స్వామివారి విగ్రహం పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ ఏడాది  సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్‌ వినాయకుడు పూజలందుకోనున్నాడు  ఈ మేరకు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్‌ సహా నిపుణులంతా ఇప్పటికే పనుల్లో వేగం పెంచారు.  ఈ ఏడాది పరిస్థితుల ప్రకారం ప్రపంచ శాంతితో పాటూ అందరికీ ఆయురారోగ్యాలు కలిగేందుకు సప్తముఖ గణపయ్యను పూజించాలని చెప్పారు దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ. ఆయన సూచనల మేరకు ఈ ఏడాది సప్తముఖాలతో వినాయకుడిని తయారు చేస్తున్నామని చెప్పింది ఉత్సవకమిటీ. 7 తలలు, 14 చేతులు, తలలపై నాగసర్పాలు…పీఠం అన్నీ కలిపి 70 అడుగుల ఎత్తులో భారీ లంబోదరుడు కొలువుతీరనున్నాడు. గతంలో తయారైన సప్తముఖ గణపతికి భిన్నంగా ఈ సారి విగ్రహాన్ని తయారుచేస్తున్నట్టు శిల్పి చెప్పారు. ఈ నెల 17 న నమూనా చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.  ఖైరతాబాద్‌ గణేశుడికి 70 ఏళ్ల చరిత్ర ఉంది.. 1954లో ఒక్క అడుగు వినాయకుడిని ఉత్సవాలు ప్రారంభించారు. ఆ తర్వాత ఏడాదికో అడుగు పెంచుకుంటూ 60 అడుగులకు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఏడాది 70వ సంవత్సరం కావడంతో ఏకండా 70 అడుగు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. పూర్తిగా మట్టితో తయారుచేసిన ప్రతిమను మాత్రమే ప్రతిష్టిస్తామని ఉత్సవకమిటీ సభ్యులు పేర్కొన్నారు.  వినాయక నవరాత్రులు అంటే ఖైరతాబాద్‌ ప్రత్యేకం అయినప్పటికీ భాగ్యనగరంలో  బాలాపూర్‌, చార్మినార్‌ ,బడి చౌడీ వంటి ప్రాంతాల్లోనూ వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. పదకొండు రోజుల పాటూ పూజలందించడం ఒకెత్తైతే.. నిమజ్జన వైభవం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. నవరాత్రులు పూర్తౌెన తర్వాత పదో రోజు ఊరేగింపుగా తీసుకెళ్లి గంగమ్మ ఒడికి చేరుస్తారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....