‘8 వసంతాలు’ సోల్‌ ఫుల్‌ Song రిలీజ్‌

పాన్‌ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘8 వసంతాలు’ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్‌`సెంట్రిక్‌ మూవీ. అనంతిక సనీల్‌కుమార్‌ లీడ్‌ రోల్‌ పోషించారు. ఇప్పటికే రిలీజైన  ప్రమోషనల్‌ కంటెంట్‌ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఫస్ట్‌ సింగిల్‌ ‘అందమా అందమా’ చార్ట్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. ఈ రోజు సెకండ్‌  సింగిల్‌ పరిచయమిలా సాంగ్‌ ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

సోల్‌ ఫుల్‌ నెంబర్స్‌ కి పాపులరైన హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ ఒక బ్యూటీఫుల్‌ మెలోడీగా స్వరపరిచారు. వనమాలి రాసిన సాహిత్యం అద్భుతంగా వుంది. వెటరన్‌ సింగర్‌ కేఎస్‌ మెలోడీస్‌ వాయిస్‌ ఆడియన్స్‌ ని మెస్మరైజ్‌ చేసింది. ఆమె మాగ్నటిక్‌ వాయిస్‌ తో సాంగ్‌ నెక్స్ట్‌ కి వెళ్ళింది. సాంగ్‌ లో విజువల్స్‌ చాలా ప్లజెంట్‌ గా వున్నాయి.నవీన్‌ యెర్నేని,వై రవిశంకర్‌ నిర్మించిన 8 వసంతాలు సోల్‌ ఫుల్‌ సినిమాటిక్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ఇవ్వబోతోంది. అరవింద్‌ ములే ప్రొడక్షన్‌ డిజైన్‌ను, శశాంక్‌ మాలి ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.  బాబాసాయి కుమార్‌ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతమైన కథనంతో ఆకట్టుకుంటుంది.  ఈ చిత్రం జూన్‌ 20న వరల్డ్‌ వైడ్‌ విడుదల కానుంది.

తారాగణం: అనంతిక సనిల్‌కుమార్‌, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్‌ రెబ్బాప్రగడ, సవిూరా కిషోర్‌

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....