80 ప్లస్‌ ఉంటే ఇంటి నుంచే ఓటు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23, (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణలో  అతి త్వరలో  జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు ఇంటి నుంచే ఓటుహక్కు వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ సదుపాయాన్ని కోరుకున్న వారికి ముందస్తుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగానికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది. దీంతో త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారాన్ని పంపింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎవరు అర్హులన్న విషయంపై.. ఎన్నికల సంఘం తాజాగా రాష్ట్ర ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చింది.30 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు కేంద్ర బలగాల్లో పనిచేస్తున్నవారు, ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది, పోలింగు ఏజెంట్లు, ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఇలా మొత్తం 11 రకాల వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకనే అవకాశన్ని కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం.  ఇందు కోసం పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం అధికారులకు సూచించింది. అయితే.. 80 ఏళ్లు దాటినవారు దివ్యాంగులు వారు కోరుకుంటే ఇంటినుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పోస్టల్‌ బ్యాలెట్లను అధికారులు నామినేషన ప్రక్రియ పూర్తౌెన అభ్యర్థులు ఖరారైన విూదట సిద్ధం చేస్తారు. అంతేకాదు ఇంటినుంచి ఓటువేసే వారికి ప్రత్యేక రంగులో బ్యాలెట్‌ పత్రాన్ని రూపొందిస్తారు.ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకున్న వారు లిఖిత పూర్వకంగా ఆ ప్రాంత ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఆయా ఓటర్ల , ఇంటికి వెళ్లి ఓటు వేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు చేయనున్నారు. మునుగోడు, నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లోనూ.. కర్ణాటక శాసనసభ ఎన్నిక ల్లోనూ ఈ విధానాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నం ప్రయోజనకరంగా ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్ని కల్లో అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి 5న విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 80 ఏళ్లు దాటిన ఓటర్లు తెలంగాణలో 4,87,950 మంది ఉన్నారు. అయితే వచ్చే నెలలో విడుదల చేసే తుది ఓటర్ల జాబితా విడుదల కానున్నది. ఈ జాబితాలో ఇలాంటి ఓటర్లు ఎంతమంది ఉంటారన్న లెక్క తెలనుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....