84 దేవాలయాలకు రూ.8 కోట్ల 60 లక్షలు మంజూరు

  

జగిత్యాల ఆగష్టు 2, (ఇయ్యాల తెలంగాణ ):తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు ద్వారా దేవాలయాల అభివృద్ధి, పునర్నిర్మాణాలకుజగిత్యాల జిల్లాలో 84 దేవాలయాలకు 8 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరుఅయినట్లు టిటిడి బోర్డు మెంబర్‌, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు తెలిపారు..ఈ మేరకుకోరుట్ల నియోజకవర్గం లో 60 దేవాలయాలు, ధర్మపురి నియోజకవర్గం లో 10 దేవాలయాలు, జగిత్యాల నియోజకవర్గం లో 9 దేవాలయాలు,అలాగే వేములవాడ నియోజకవర్గం లో 5 దేవాలయలకు నిధులు మంజూరి అయినట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు  తెలిపారు.ఈ దేవాలయాల అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయని ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు తెలిపారు. దేవాలయాలకు అభివృద్ధి కి నిధులు మంజూరు చేసిన టిటిడి బోర్డు మెంబర్‌  విద్యాసాగర్‌ రావు కు ఎంపీపీ తోట నారాయణ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఆన్నం `లావణ్య ,బీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు ఆన్నం ఆనిల్‌ , మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....