హైదరాబాద్, జనవరి 27, ఇయ్యాల తెలంగాణ : విద్యార్థులలో దాగి ఉన్న సృజన్నాత్మకతను వెలికి తీయియడాని కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఎక్జిబిషన్, రాష్ట్ర స్థాయి ఎక్సహిబీషన్ జాతీయ స్థాయి ఎక్సహిబీషన్ లలో హైదరాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నుంచి పలు పాఠశాలలకు చెందిన విద్యార్థినీ. విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయిలో ఎక్సహిబీషన్ హైదరాబాద్ జిల్లా నుండి 148 విద్యార్థులు పాల్గొన్నారు , రాష్ట్ర స్థాయికి 14 విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది , రాష్ట్ర స్థాయిలో మొత్తం 296 విద్యార్థులలో 29 విద్యార్థులు జాతీయ స్థాయి ఇన్ స్పైర్ అవార్డు ఎక్సహిబీషన్ న్యూ ఢిల్లీకి ఎంపిక కావడం జరిగింది, హైదరాబాద్ జిల్లా నుండి 2 విద్యార్థులు జాతీయ స్థాయి ఇన్ స్పైర్ కు ఎంపికాకావడం జరిగింది .
(1)భారతీయ విద్య భవన్ పబ్లిక్ స్కూల్ జూబ్లీహిల్స్ 8వ తరగతి విద్యార్థిని శ్రీ వైష్ణవి గోవర్ధన
(2) సెయింట్ పీటర్స్ హై స్కూల్ బోయిన్ పల్లి 9వ తరగతి విద్యార్థిని అర్వి రెడ్డి.
ఈ ఇద్దరు విద్యార్థులు హైదరాబాద్ జిల్లా నుండి జాతీయ స్థాయికి ఇన్ స్పైర్ న్యూ ఢిల్లీ కి ఎంపికాకావడం జరిగింది.
రాజ్య స్థారియ బాల వైగ్యనిక ప్రదర్శిని లో రాష్ట్ర స్థాయి నుండి సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ లో హైదరాబాద్ జిల్లా నుండి 2 స్కూల్ ఎంపికాకావడం జరిగింది,
(1) శ్రీ సరస్వతి శిశు మందిర్ టీచర్స్ టీచర్ లెర్నింగ్ మెటీరియల్ లో పాల్గొంటారు
(2) అల్ సాయింట్స్ హై విద్యార్థి ఎంపికాకావడం జెరిగింది.