కాకినాడ, జూలై 02 (ఇయ్యాల తెలంగాణ) : ఉప ముఖ్యమంత్రి, , పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్., పర్యావరణ, అటవీ శాఖల మంత్రిల పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో శాఖల వారి సవిూక్ష చేసారు. జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు సవిూక్షకు హాజరయ్యారు. శాఖల వారీగా కాకినాడ జిల్లాలో ఉన్న స్థితిగతులను పవన్ కళ్యాణ్ కి అధికారులు వివరించారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.