ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 12న నిర్వహిస్తారు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తాధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విభాగమైన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) 2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవంను ప్రారంభించింది.అన్ని వయస్సుల బాల కార్మికులకు నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందజేయడం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకార్మికులను గర్తించి, వారికి అన్ని వసతులను కల్పించి సంపూర్ణ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం. ప్రతి సంవత్సరం జూన్ 12న, బాల కార్మికుల దుస్థితిని హైలైట్ చేసి వారికి ఏమి సహాయం చేయవచ్చో చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రభుత్వాలు, యజమానులు, కార్మికుల సంస్థలు, పౌర సమాజం, అలాగే లక్షలాది ప్రజలను ఏకవేదిక విూదికి తెస్తుంది.
“