👉 రేపు పాలిసెట్ ప్రవేశ పరీక్ష
👉నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
👉గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి
👉జగిత్యాల జిల్లా పాలిసెట్ కన్వీనర్ డా. అరిగెల అశోక్
జగిత్యాల మే 24 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే (పాలిసెట్`2024) ఎంట్రెన్స్ పరీక్షను శుక్రవారం నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్, పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అరిగెల అశోక్ గారు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అందులో 2190 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనికిసంబంధించి స్టేట్ అబ్జర్వర్ తో పాటు ఏడుగురు అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సమయానికంటే గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషంఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడరని, ఓఏంఆర్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు బ్లాక్ లేదా బాల్ పెన్ మాత్రమే వాడాలని, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించడంజరగదని పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అరిగెల అశోక్ ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాలిసెట్ ఎంట్రెన్స్ ను పకడ్బందీగా నిర్వహించాలని గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అరిగెల అశోక్ , అసిస్టెంట్ కో ఆర్డినేటర్ పడాల తిరుపతి, చీఫ్ సూపరిండెంట్లు డి, కరుణాకర్, ఎన్, సందీప్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.