
హైదరాబాద్, జూన్ 26 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముదిరాజులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో క్యాబినెట్ బాధ్యతలు తీసుకున్న వాకిటి శ్రీహరి ముదిరాజ్ ను ఈ సందర్బంగా కలసి ప్రత్యేక అభినందనలు తెలుపడం జరిగింది. నిజాంబాద్ ముదిరాజ్ సంఘం నాయకులు గోపి ముదిరాజ్ గంగాధర్ ముదిరాజ్ ముదిరాజ్ జాతీయ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ నిజాంబాద్ జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు కార్యకర్తలు వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.