ADITYA ? L 1 ప్రయోగం విజయవంతం

నెల్లూరు సెప్టెంబర్ 2 (ఇయ్యాల తెలంగాణ )అదిత్య ఎల్‌ 1 ప్రయోగం విజయవంతం అయింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా పైపైకి దూసుకుపోయింది.  అదిత్య ఎల్‌ 1 ఉపగ్రహాన్ని ఇస్రో సంస్థ శనివారం ఉదయం 11.50 గంటలకు పిఎస్‌ఎల్వీ సి57 ద్వారా పంపించింది. సూర్యుని చుట్టూ దాగి ఉన్న వాతావరణ రహస్యాల గుట్టు విప్పడానికి సిద్దమైంది. ఆదిత్య ఎల్‌ 1 మిషన్‌ ను  భూమి నుండి 1.5 మిలియన్‌ కివిూ దూరంలో ఉన్న సూర్యునికి భూమికి మధ్య ఉండే   లాగ్రాంజ్‌ పాయింట్‌ 1 (ఎల్‌ 1) చుట్టూ ఒక హాలో కక్ష్యలో ఉంచుతారు. ఆదిత్య మిషన్‌  ఎటువంటి గ్రహాలూ అడ్డు లేకుండా సూర్యుడిని నిరంతరం వీక్షించే విధంగా అంతరిక్షం లో నిలపడం జరుగుతుంది,  ఇది ఉష్ణోగ్రత మార్పులు, వాటి పరిమాణాలు,  అక్కడ జరిగే వాతావరణ మార్పుల  సమాచారాన్ని అందిస్తుంది. ఆదిత్య ఎల్‌  మిషన్‌ ప్రయోగం అనంతరం 125 రోజుల పాటు సుదీర్ఘంగా ప్రయాణించి సూర్యునికి దగ్గరలోని లాంగ్‌ రేంజ్‌ 1 కక్ష దగ్గరికి చేరుకుంటుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....