AIతో కూలీల పనులకు చెక్‌

గుంటూరు, సెప్టెంబర్‌ 26, (ఇయ్యాల తెలంగాణ ); ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతున్న సరికొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌.. అన్ని రంగాల్లోనూ ఈ టెక్నాలజీ వాడేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. వైద్య రంగంలో చికిత్స అందించేందుకు వాడే రోబోల్లోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ వాడుతున్నారు. అయితే సరికొత్తగా వ్యవసాయ రంగంలోనూ దీనికి ప్రాధాన్యత ఉందని వ్యవసాయ శాస్త్ర వేత్తలు భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు. ఇదంతా చేస్తున్నది విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలేం కాదు. మన దేశంలో, మన రాష్ట్రంలో వ్యవయసాయ రంగంలో పేరు గాంచిన ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు.వ్యవసాయ రంగం ప్రస్తుతం తీవ్ర కూలీల కొరత ఎదుర్కొంటుంది. దీంతో వివిధ పనులు చేసేందుకు సకాలంలో కూలీలకు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నాటు వేసేందుకు, కలుపు తీసేందుకు, కోత కోసేందుకు కూలీలు ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతారు. అయితే ఒకే సమయంలో అంతమంది కూలీలు లభ్యంకాక రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాదిలోనే ఎన్జి రంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు డ్రోన్లను అందుబాటులోకి తెచ్చారు. పురుగుమందుల పిచికారీ చేసేందుకు డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఏపిలో నాలుగు లక్షల ఎకరాల్లో డ్రోన్ల సాయంతో వ్యవసాయం చేస్తున్నారు. వీటితో పురుగు, కలుపు, తెగులు మందులు పిచికారీ చేయడంతో పాటు యూరియా, డిఎపి వంటి ఫెర్టిలైజర్స్‌ ను చల్లుతున్నారు.అయితే ప్రస్తుతం వ్యవసాయ శాస్త్రవేత్తల దృష్టంతా రోబోలు తయారీపై ఉంది. ఈ రోబోల తయారీలో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ వినియోగించాలని నిర్ణయించారు. ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు. వ్యవసాయ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు ఇప్పటికే కలుపు తీసే రోబోలపై ప్రయోగాలు చేస్తున్నారు. అదే విధంగా పురుగు మందు చల్లేందుకు సాంప్రదాయ పద్ధతిలో అయితే రెండు గంటల సమయం పడుతుంది. అదే డ్రోన్లతో అయితే ఆరు నిమిషాల్లోనే ఎకర విస్తీర్ణంలో పురుగు మందు పిచికారీ పూర్తవుతుంది.ఇవే కాకుండా వాతావరణంలో ఎంత తేమ ఉంది, దాని వలన ఎటువంటి తెగుళ్లు రాబోతున్నాయి, భూసారం స్థాయి ఎంత వంటి అంశాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూసార పరీక్షల కోసం శాంపిల్స్‌ తీయడానికి ప్రస్తుతం సరిపడినంతా సిబ్బంది అందుబాటులో లేరు. ఈ క్రమంలోనే రోబోలను వినియోగిస్తే చాలా సులభంగా శాంపిల్స్‌ సేకరణ చేయవచ్చంటున్నారు.ఇప్పటికే సాగు పద్దతుల్లో రోబోను శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా పరీక్షించారు. సంప్రదాయ సాగు పద్దత్తులో రోబోను వినియోగించడం ద్వారా నాలుగైదు రెట్ల సామార్ధ్యంతో పనిచేసినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. దీంతో కూలీలు దొరక్కపోయిన సకాలంలో పంట కోయడానికి విత్తనం విత్తడానికి కలుపు, పురుగుమందులు పిచికారీ చేయడానికి రోబోలు ఉపయోగపడతాయి. ఈ క్రమంలోనే రోబోలను అందుబాటులోకి తెచ్చేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు వడివడిగా అడుగులు వేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ తో కూడిన రోబోలు మన వ్యవసాయ క్షేత్రాల్లో బుడిబుడి అడుగులు వేస్తాయని శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....