కనీస ఉపకార వేతనం నెలకు రూ. 7 వేలు, గరిష్టంగా 24 వేలు
నైపుణ్య ఉపకారవేతనం అందించేలా నైపుణ్య విద్యపై దృష్టి
డా. బీ ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఘంటా చక్రపాణి వెల్లడి
హైదరాబాద్, జూలై 7 (ఇయ్యాల తెలంగాణ) : విద్యార్ధుల్లో చదువుతో పాటు నైపుణ్యాన్ని పెంచడం, ఉపకారవేతన ఆధారిత విద్యను అందించనున్నట్లు డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందిస్తోందని వైస్ ఛాన్సలర్ ఆచార్య ఘంటా చక్రపాణి వెల్లడిరచారు. సోమవారం డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఖీరూఅఎ) తో అంబేద్కర్ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఖీరూఅఎ) ఎగ్జిక్యూటివ్ హెడ్ జేమ్స్ రాఫెల్ లు ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి సమక్షంలో అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశారు. అనంతరం విశ్వవిద్యాలయ ఉపకులపతి ఘంటా చక్రపాణి మాట్లాడుతూ రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయమన్నారు. విద్యార్థుల్లో చదువుతో పాటు నైపుణ్యం పెంచేందుకు ఈ అవగాహన ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. స్టైఫండ్ ఆధారిత విద్యను ( స్టైఫండ్ బేస్డ్ అప్రెంటిషిప్ ప్రోగ్రాం ? ూంఖ) సద్వినియోగం చేసుకోవాలని విద్యార్ధులను కోరారు.
తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమ ఆవశ్యకతను తెలియజేస్తామని తెలిపారు. త్వరలోనే యూనివర్సిటీ వెబ్ పోర్టల్‌లో వివరాలను పొందుపరుస్తామని వెల్లడిరచారు. రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తో ఉమ్మడి ప్రవేశ నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కి చదువుతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించడం, లేదా వాళ్ళను వ్యాపారవేత్తలుగా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం లో చేరడం ద్వారా నెలకు కనీసంగా రూ. ఏడు వేల నుంచి గరిష్టంగా 24 వేలు లేదా అంత కంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉందన్నారు. తమ విశ్వవిద్యాలయం నుంచి ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా అర్హులేనని వెల్లడిరచారు. ఈ ప్రోగ్రాంలో చేరడానికి 18`28 సంవత్సరాల వయసు గల విద్యార్ధులు అర్హులని పేర్కొన్నారు. తమ విద్యార్ధుల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ప్రఖ్యాత సంస్థలతో మరిన్ని అవగాహన ఒప్పందాలను చేసుకోనున్నట్లు వెల్లండిరచారు. రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక అధిపతి జేమ్స్ రాఫెల్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థికీ ప్రయోజనం కలిగించేందుకు తమ సంస్థ పనిచేస్తుందన్నారు. ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి వారికి చదువుతున్నప్పుడే ఆర్ధికంగా సహాయ పడేలా స్టయి ఫండ్ అందించనున్నట్లు వెల్లడిరచారు. వ్యక్తి, సంస్థ, పరిశ్రమ, భారతదేశం (ఫోర్`ఐ ) భావనతో ఈ కోర్సులను రూపొందించామని చెప్పారు. ఈ విధానం ద్వారా డా. బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు చాలా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. వృత్తిపరమైన శిక్షణ విద్యార్ధుల్లో మానసిక, ఆర్ధిక స్థైర్యాన్ని ఇస్తుందని వెల్లడిరచారు.
రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి సవిూర్ నర్సాపూర్ మాట్లాడుతూ పరిశ్రమనే ఉత్తమ ఉపాధ్యాయుడు అని పేర్కొన్నారు. వృత్తిపరమైన ప్రమాణాలను రూపొందించుకోవాలని సూచించారు. ఒక నిర్దిష్ట ఉద్యోగంపై పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకుని, పాఠ్యప్రణాళిక, అప్రెంటిషిప్ ఉంటుందని వెల్లడిరచారు. రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ, అకాడమిక్ (సౌత్ రీజియన్) జనరల్ మేనేజర్ చందా వడ్డే మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్ధులు ప్రొఫెషనల్‌గా మారడంతో పాటు డిగ్రీ సర్టిఫికెట్ ను కూడా పొందొచ్చని పేర్కొన్నారు. స్థానికంగా ఉండే రిటేయిల్, పెద్ద పెద్ద సంస్థల్లో, బహుళ జాతి సంస్థల మాల్స్ లో పనిచేసేందుకు విద్యార్థులకు చదువుతో పాటు ఆర్ధికంగా వనరులను సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడిరచారు. విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి మాట్లాడుతూ ఈ కొత్త ప్రోగ్రాంతో ప్రతి విద్యార్థి మరింత ఆర్థికంగా స్వావలంభన సాధించొచ్చని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డా. ఎల్ విజయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాల సహాయంతో గ్రావిూణ ప్రాంతాలలో విస్తృత ప్రచారం చేపడుతామని, విద్యార్ధులకు, వారి వారి తల్లిదండ్రులకు అవగాహన్ కల్పిస్తామని పేర్కొన్నారు. రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ వివరాలను, అవగాహనా ఒప్పంద వివరాలను ఈ.ఎం.ఆర్.ఆర్.సి. డైరెక్టర్ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్ వెల్లడిరచారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొ. పల్లవీ కాబ్డే వందన సమర్పణ చేసారు.