AP లో TDP కి సానుభూతి పెరిగింది బండి సంజయ్‌

కరీంనగర్‌ సెప్టెంబర్ 14 (ఇయ్యాల తెలంగాణ );ఏపీ మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ పై కరీంనగర్‌ ఎంపి  బండి సంజయ్‌ స్పందించారు. ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌ తో టీడీపీ కి సానుభూతి పెరిగింది. బాబు ను టార్గెట్‌ పెట్టుకొని అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ ను సామాన్య ప్రజలు తప్పు పడుతున్నారని అయన అన్నారు. మాజీ సీఎం అరెస్ట్‌ విషయం లో నిబంధన లు పాటించలేదు. ఇలా మాట్లాడితే.. టీడీపీ ఏజెంట్స్‌ అంటూ వైస్సార్సీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తప్పు చేస్తే.. అరెస్ట్‌ చేయడం తప్పు కాదని అయన అన్నారు.

లోక్‌ సభ, శాసనసభ ఎన్నికలు  వేరు వేరు గా  వస్తే కరీంనగర్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తాను. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికే కరీంనగర్‌ అసెంబ్లీ ఎన్నికల పని మొదలు పెట్టానని అయన అన్నారు. ..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....