హైదరాబాద్, ఆగష్టు 3 (ఇయ్యాల తెలంగాణ) : గురువారం నాడు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజే యూత్ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని… ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ వైపు దూసుకొస్తున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి తో, నగర అధ్యక్షుడు మోటా రోహిత్ పాటు ఇతర నేతలను పో లీసులు అడ్డుకున్నారు. తరువాత అందోళనకారులను అరెస్టు చేసారు.