August 15 నాటికి భూ భారతి Revenue సదస్సుల దరఖాస్తుల పరిష్కారం

పెండిరగ్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను లబ్దిదారుల ద్వారా పూర్తి చేయాలి

రైతులకు సమృద్ధిగా ఎరువుల సరఫరాకు పకడ్బందీ చర్యలు,

లక్షా 25 వేల ఎకరాల ఆయిల్‌ పామ్‌ పంట సాగు విస్తీర్ణ లక్ష్యంగా చర్యలు

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సవిూక్షించిన సీఎస్‌.

కరీంనగర్‌, జూన్ 24 (ఇయ్యాల తెలంగాణ) :ఆగస్టు 15 నాటికి భూ భారతి రెవెన్యూ సదస్సుల క్రింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే. రామ కృష్ణా రావు అన్నారు.

మంగళవారం హైదరాబాద్‌ నుంచి సి.ఎస్‌ కే.రామ కృష్ణా రావు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల  పై  జిల్లా కలెక్టర్‌ లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  సవిూక్ష నిర్వహించారు.  ఆన్‌ లైన్‌ నుంచి  అటవీ, పర్యావరణ శాఖ మంత్రి వర్యులు  కోండా సురేఖ  హాజరయ్యారు.  

వన మహోత్సవం కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్ల, ఎరువుల లభ్యత, ఆయిల్‌ పామ్‌ పంట విస్తరణ, సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చర్యలు, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం వంటి పలు అంశాల పై సీఎస్‌ సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు చేశారు.

రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే. రామ కృష్ణా రావు మాట్లాడుతూ, 2 లక్షల 30 వేల కు పైగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశామని, లక్షకు పైగా ఇండ్ల నిర్మాణ పనులు గ్రౌండ్‌ అయ్యాయని అన్నారు. పెద్ద వర్షాలు కురవడానికి ముందే మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండిరగ్‌, బేస్మెంట్‌ స్థాయి వరకు నిర్మాణం జరిగేలా చూడాలని సీఎస్‌ సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తూ  సీనరేజి చార్జిలను ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు.  డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పెండిరగ్‌ పనులు లబ్ధిదారులు పూర్తి చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. ప్రస్తుతం ఎంత మేరకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం జరిగిందో ఎంబీ రికార్డులను నమోదు చేసి లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించాలని, ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుందని అన్నారు.

పిఎం ఆవాస్‌ యోజన అర్భన్‌ 2.0  క్రింద మనకు లక్షా 13 వేల ఇండ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని,  ప్రతి పట్టణం నుంచి కనీసం 500 మంది నిరు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ లకు సీఎస్‌ సూచించారు.

వన మహోత్సవం కార్యక్రమం క్రింద ఇండ్లకు పంపిణీ చేసే మొక్కల పెంపకం సైతం పరిశీలించాలని, మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎస్‌ కలెక్టర్‌ లకు సూచించారు. ప్రతి జిల్లా ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసుకుని వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలని,  నాటిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు జియో కో`ఆర్డినేట్స్‌ తో ఆన్‌ లైన్‌ లో నమోదు చేయాలని అన్నారు.

ప్రతి జిల్లాలో ఎరువుల లభ్యత స్టాక్‌ పై రివ్యూ పెట్టాలని అన్నారు.  జూలై వరకు అవసరమైన స్టాక్‌ ప్రస్తుతం అందుబాటులో ఉందని,  సెప్టెంబర్‌ నాటికి అవసరమైన ఎరువుల స్టాక్‌ ప్రోక్యూర్‌ చేస్తున్నామని అన్నారు.  ఎరువుల స్టాక్‌ ను ప్రత్యేక అధికారులను నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు.

రిటైల్‌ విక్రయాలను డిజిటలైజ్‌ చేయాలని కలెక్టర్‌ లకు సీఎస్‌ సూచించారు. వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల షాప్‌ వద్ద ఎక్కడ కొరత రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.

లక్షా 25 వేల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ పంట సాగు ప్రస్తుత సంవత్సరం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.  రైతులకు లాభసాటి పంట ఆయిల్‌ పామ్‌ పట్ల అవగాహన కల్పిస్తూ పంట విస్తరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల ద్వారా దాదాపు 8 లక్షల 27 వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిని సాధా బైనామా,  ఆర్‌ఓఆర్‌ సమస్యలు, పట్టాలో కరెక్షన్స్‌  వంటి వివిధ సమస్యల పై దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.  ఆగస్టు 15 నాటికి ఈ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....