హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఇయ్యాల తెలంగాణ) : పాదయాత్రగా అయోధ్యకు వెళ్లి వచ్చిన యువకులకు ఈ నెల 10 వ తేదీన ఘన సన్మానం చేయనున్నట్లు తెలంగాణ ముదిరాజ్ రాష్ట్ర సీనియర్ సిటిజన్ సంఘం తెలిపింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ లోని ముదిరాజ్ భవన్ లో సన్మానం చేయనున్నట్లు తెలిపారు. అయోధ్య వెళ్లి వచ్చిన యువకులకు నిర్వహిస్తున్న సన్మాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా సుదర్శన్ ముదిరాజ్ గోవింద రాములు ముదిరాజ్ డి సదానంద ముదిరాజ్ పొట్లకాయల వెంకటేశ్వర్లు లు కోరారు.