BABU కి తోడుగా మేము సైతం రిలే నిరాహార దీక్షలో తెలుగుదేశం నేతలు

శ్రీశైలం సెప్టెంబర్ 14 (ఇయ్యాల తెలంగాణ ): నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం శ్రీశైలం నియోజకవర్గం బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి  ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సుండి పెంట రింగ్‌ పార్కు దగ్గర  అక్రమ అరెస్టును నిరశిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.చంద్ర బాబు నాయుడు  మచ్చలేని నాయకులు అని, ఆయన ఏటువంటి తప్పు చెయ్యకపోయినా, పెట్టిన కేసులో ఏటువంటి ఆధారాలు లేకపోయినా,73 ఏళ్ల వయస్సులో ఆ మహా మనిషిని రాజకీయ కక్ష్యతో, అధికారం వుంది కదా అని సీఐడీ, పోలీస్‌ వ్యవస్థలను వాడుకొని బాబు గారిని ఇబ్బందికి గురి చేస్తున్నారని, మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ప్రభుత్వం మారితే ముఖ్యమంత్రి  పరిస్తితి ఎంత దారుణంగా వుంటుందో తెలుసుకోవాలని, బాబు గారినీ బయటికి వదిలేంత వరకు కూడా ఈ రిలే నిరాహారదీక్షలు అనేవి చేస్తూనే వుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....