హైదరాబాద్, జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ) : బల్కంపేట్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి రావాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కు ఎమ్మార్పీఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఆయనను కలసి ఆహ్వాన పత్రికను అందించారు. పద్మశ్రీ వచ్చినందుకు శాలువాతో ఆయనను సత్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. బల్కంపేట్ శ్రీ రేణుక ఎల్లమ్మ కల్యాణానికి సకుటుంబ సమేతంగా హాజరు కావాలని మంద కృష్ణ ను కోరారు. ఆహ్వానం పలికిన వారిలో ఎమ్మార్పీఎస్ నాయకులు దళిత రత్న పొలిమేర సంతోష్ కుమార్ మాదిగ నారాయణ సతీష్ రామేశ్వరం రమేష్ రాములు మరియు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
- Homepage
- Sanath Nagar News
- బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణానికి ఆహ్వానం
బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణానికి ఆహ్వానం
Leave a Comment
Related Post