BC లకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి`: జంతర్‌ మంతర్‌ వద్ద BC ల ధర్నా

 

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 14 (ఇయ్యాల తెలంగాణ) :  జంతర్‌ మంతర్‌ వద్ద  జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  నిర్వహించిన  ధర్నాలో భాగంగా  బీసీలకు పొలిటికల్‌ రిజర్వేషన్‌  కల్పించాలని  రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య గారు  ఆందోళనలు  చేపట్టారు.   ధర్నాలో భాగంగా బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్‌,  జాతీయ బీసీ సంక్షేమ సంఘం  తెలంగాణరాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి  సత్యనారాయణ గౌడ్‌  మాట్లాడుతూ  రాజకీయపరంగా  బీసీలను అణగదొక్కుతూనే ఉన్నారు కానీ  బీసీలకు బంగారు భవిష్యత్తు చూపే  విధంగా  ఏ ప్రభుత్వం కూడా  ప్రత్యేక శ్రద్ధ వహించకుండా  కల్లబొల్లి మాటలతో పబ్బం గడుపుతున్నారే గాని  బీసీలకు ప్రత్యేకంగా  పొలిటికల్‌ రిజర్వేషన్‌  కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో  ఏర్పడ్డ  కాంగ్రెస్‌ ప్రభుత్వనికి  అధ్యక్షత వహించి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న  రేవంత్‌ రెడ్డి  గారి  దృష్టికి  బీసీల పొలిటికల్‌ రిజర్వేషన్‌ గురించి  మరియు  తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ  సమస్యలను  పరిష్కరించటకు  తెలంగాణ  కాంగ్రెస్‌ ప్రభుత్వం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు.  ధర్నాలో  భాగంగా  జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....