BC లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి హరీష్‌ రావు

సిద్దిపేట ఆగష్టు 9 (ఇయ్యాల తెలంగాణ ): వెనుకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో   నిర్వహించిన  కుల వృత్తులను ప్రోత్సహించడానికి  లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమం  సిద్దిపేటలో జరిగింది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్‌ రావు హాజరై నారాయణరావుపేట, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట రూరల్‌ మండలాలలోని 200 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ కుల వృత్తులను కాపాడి వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బిసి కుల వృత్తిదారులకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయపథకం. బ్యాంకుల ద్వారా షూరిటీ, గ్యారెంటీ  లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో నేరుగా  లబ్ధిదారులకు ఒక లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేస్తున్నాం.  ముఖ్యమంత్రి బీసీ కుల వృత్తిదారులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో  నాయి బ్రాహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంటు ఇస్తున్నాం. గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ చేస్తున్నామని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....