BC సంఘం నేత ఆర్‌ కృష్ణయ్యతో కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి భేటీ

కాంగ్రెస్‌ లోకి ఆహ్వానం..ఆలోచిస్తానన్న కృష్ణయ్య..

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 25 (ఇయ్యాల తెలంగాణ) : బీసీ సంఘం నేత ఆర్‌ కృష్ణయ్యతో కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం ఇద్దరు భేటీ అయి పలు విషయాలపై చర్చించినట్లు తెలిసింది  ఈ సందర్భంగా ఆర్‌ కృష్ణయ్యను మల్లు రవి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బీసీ, కులగణన, రిజర్వేషన్ల కోసమే తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేశానని.. కాంగ్రెస్‌ పార్టీలో చేరికపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని మల్లు రవితో ఆర్‌. కృష్ణయ్య చెప్పినట్లు తెలుస్తోంది.కాగా, వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్‌ మంగళవారం ప్రకటించారు. పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆర్‌.కృష్ణయ్య రాజీనామా చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు ఆర్‌. కృష్ణయ్య చెప్పుకొచ్చారు.. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....