BEAUTY PARLOUR కు వెళితే…ఉన్నదంతా పోయి

 
హైదరాబాద్‌, ఆగస్టు 3, (ఇయ్యాల తెలంగాణ ): ఇది అత్యాశానా? లేక అవకాశం ఉందని ప్రయత్నించిందా..? కారణాలేవైనా.. ఆ మహిళ ఏదో చేయబోతే మరేదో అయింది.. తీరా.. ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయి లబోదిబోమంటోంది. ఆమె చేసిన తప్పు ఏంటంటే.. తన భర్త కోరిక తీర్చాలన్న ఉద్దేశంతో ఆ మహిళ ఓ బ్యూటీపార్లర్‌కు వెళ్లింది.. జట్టు బాగా పొడవు కావాలని చెప్పింది. దీంతో వారు ఏదో ఆయిల్‌ను ఇచ్చారు. ఆ నూనెను తలకు పట్టించిన నాటినుంచి ఆమెకు మరో సమస్య మొదలైంది.. జుట్టు పొడవుగా పెరగడం ఏమో కానీ.. ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయింది. ఈ షాకింగ్‌ ఘటన హైదరాబాద్‌లోని పాత బస్తీలో చోటుచేసుకుంది.బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్‌ సిటీకి చెందిన ఓ మహిళ అబిడ్స్‌లో బ్యూటీ పార్లర్‌కి వెళ్లింది. తనను మోడల్‌గా చూడాలనుకుంటున్న భర్త కోరికను తీర్చడమే తన ప్రయత్నమని.. ఎలాగైనా తన సమస్యకు దారి చూపాలంటూ వారికి చెప్పింది. దీంతో వారు ఏవేవో సూచనలు చేశారు. బ్యూటిషియన్‌ చెప్పినట్లు పొడుగ్గా ఉన్న హెయిర్‌ని కట్‌ చేయించుకుంది. ఆ తర్వాత బ్యూటీషియన్‌ హెయిర్‌ ఆయిల్‌ పెట్టింది. అంతా బాగానే ఉందనుకుని సంతోషంలో ఉండగానే.. మరో సమస్య ఆమెను వెంటాడిరది.బ్యూటీషియన్‌ చెప్పినట్లు జట్టు కోసం చికిత్స తీసుకుంటే.. ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయింది. నూనెతో మర్దన చేయగానే.. ఉన్న జుట్టు మొత్తం ఊడి రావడంతో కంగుతిన్న బాధితురాలు ఇంటికి పరుగులు తీసింది. భార్య హెయిర్‌ ఊడిపోవడం చూసి భర్త షాక్‌కి గురయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.తర్వాత ఊడిపోతున్న వెంట్రుకలని పట్టుకుని బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి.. పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బ్యూటీ పార్లర్‌పై దాడి చేసి నిర్వాహకులని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. బ్యూటీ పార్లర్‌ నిర్వాహకులు పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....