Big Bull గా సంజయ్‌ దత్‌ First Look

 క్రేజీ ఇండియన్‌ ప్రాజెక్ట్‌’ డబుల్‌ ఇస్మార్ట్‌’ సంజయ్‌ దత్‌ బిగ్ బుల్‌ గా  ఫస్ట్‌ లుక్‌ 

ఉస్తాద్‌ రామ్‌ పోతినేని, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ల క్రేజీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. వారి గత బ్లాక్‌ బస్టర్‌ ఇస్మార్ట్‌ శంకర్‌కి సీక్వెల్‌ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ కొద్ది రోజుల క్రితం ముంబైలో ఒక ఇంటెన్స్‌ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించడంతో ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాధ్‌, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్‌ స్టైలిష్‌ మేకోవర్‌ అయ్యారు. విషు రెడ్డి సీఈవో. మేకర్స్‌ ఈ రోజు ఒక బిగ్‌ అప్‌డేట్‌తో వచ్చారు. బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌దత్‌ డబుల్‌ ఇస్మార్ట్‌లో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఆయన మొదటి షెడ్యూల్‌ షూట్‌లో జాయిన్‌ అయ్యారు. ఈరోజు, సంజయ్‌ దత్‌ పాత్రను బిగ్‌ బుల్‌గా పరిచయం చేస్తూ మేకర్స్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో ఫంకీ హెయిర్‌డో, గడ్డం, చెవిపోగులు, ఉంగరాలు, ఖరీదైన గడియారం, ముఖం, వేళ్లపై పచ్చబొట్టుతో అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు సంజయ్‌ దత్‌. ఈ స్టన్నింగ్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో సంజయ్‌ దత్‌ సిగార్‌ తాగుతున్నట్లు కనిపించారు. గన్స్‌ అతని వైపు గురిపెట్టినట్లు కనిపిస్తున్నాయి. సంజయ్‌ దత్‌ పవర్‌ ఫుల్‌ క్యారెక్టర్‌ లో నటిస్తున్నట్లు పోస్టర్‌ ద్వారా తెలుస్తోంది.తన నటీనటులను బెస్ట్‌ మాస్‌ అప్పీలింగ్‌ లో ప్రజంట్‌ చేయడంతో దిట్ట అయిన పూరి జగన్నాథ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ లో సంజయ్‌ దత్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించనున్నారు.రామ్‌, సంజయ్‌ దత్‌లను తెరపై కలిసి చూడటం అభిమానులకు, సినీ ప్రియులకు ఎక్సయిటింగ్‌ గా ఉంటుంది. ఈ వైల్డ్‌ కాంబినేషన్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది.సినిమా కోసం పని చేస్తున్నందుకు తన ఆనందాన్ని పంచుకున్నారు సంజయ్‌ దత్‌. ‘’డైరెక్టర్‌ ఆఫ్‌ ది  మాసెస్‌ పూరీ జగన్నాధ్‌ జీ, యంగ్‌ ఎనర్జిటిక్‌ ఉస్తాద్‌  రామ్‌ తో కలసి సైన్స్‌ ఫిక్షన్‌ మాస్‌ ఎంటర్‌ టైనర్‌  ‘ డబుల్‌ ఇస్మార్ట్‌’ లో బిగ్‌ బుల్‌ పాత్ర చేయడం ఆనందంగా, చాలా గర్వంగా ఉంది. ఈ సూపర్‌`టాలెంటెడ్‌ టీమ్‌తో జతకట్టడానికి సంతోషిస్తున్నాము. 2024 మార్చి 8 ‘ డబుల్‌ ఇస్మార్ట్‌’ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు.

ఈ హై`వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కోసం హాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు. డబుల్‌ ఇస్మార్ట్‌ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు మేకర్స్‌. 

డబుల్‌ ఇస్మార్ట్‌  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.  

తారాగణం: రామ్‌ పోతినేని, సంజయ్‌ దత్‌

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....