BJP అభ్యర్దులను గెలిపించాలి : కిషన్‌ రెడ్డి

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 24 (ఇయ్యాల తెలంగాణ) : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రముఖులు, మేధావుల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడారు. పట్టభద్రులు, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలు గతంలో అద్వాని ఆధ్వర్యంలో జరిగిన రాతయాత్ర లో ఆ రోజు ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలు చూపిన చొరవ బ్రహ్మ రథం పట్టిన తీరును మర్చిపోలేను. గత ఎన్నికల్లో 4ఎమ్మెల్యే స్థానలను ఓ ఎంపీ స్థానాన్ని కట్టబెట్టి మరోసారి బీజేపీకి అండగా నిలబడి బీజేపీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్బంగా విూకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పస్తుతం జరుగుతున్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చాలా ప్రాధాన్యత ఉన్న ఎన్నికలు ఈ ఎన్నికల్లో విూరు ఖచ్చితంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు అండగా నిలబడాలని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....