సనత్ నగర్,ఏప్రిల్ 21 (ఇయ్యాల తెలంగాణ) : బీజేపీ సనత్ నగర్ పరివార్ సభ్యులు బుధవారం 20 ఏప్రిల్ 2022 న బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ పుట్టిన రోజు సందర్భంగా సనత్ నగర్ నెహ్రూ పార్క్ వద్ద గల శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయంలో ఉదయం గం.09.09 ని లకు ఆ తరువాత శ్రీ హనుమాన్ దేవస్థానం ప్రాంగణం లోని శ్రీ గణపతి దేవాలయంలో మరియు శ్రీ అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత బల్కంపేట్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో పూజ తరువాత మధ్యాహ్నం ESI హాస్పిటల్ సమీపాన గల బంగారు మైసమ్మ ఆలయం వద్ద కూడా పూజలు నిర్వహించిన అనతరం ఆమె బీజేపీ పరివార్ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో కలిసి సహపంక్తి భోజనం చేసారు. బీజేపీ పరివార్ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలషులందరి సమక్షంలో ఆమె చేత కేక్ కట్ చేయించి శుభాభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ర కార్యవర్గ సభ్యులు యేచన్ సురేష్, తాళ్ల జైహింద్ గౌడ్ లు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో తనదైన శైలిలో నడక సాగిస్తూ, సత్సాంప్రదాయాలు నెలకొల్పుతూ, అభిమానులను కూడగట్టుకుంటూ, ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తూ కొనసాగేందుకు భగవంతుడు ఆమెకు సర్వశక్తులు ప్రసాదించాలని భగవంతుడిని వేడుకున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రాజ్ పురోహిత్, ఆకూరి శ్రీనివాస్ రావు, దశరథ్ గౌడ్, వై శ్రీనివాస్ రావు, చరణ్ సింగ్ పూల్, సి వి శ్రీనివాస్, కే. సుధాకర్ ముదిరాజ్, పొలిమేర సంతోష్, పురుషోత్తం, జె. ప్రవీణ్ గౌడ్, మల్లిఖార్జున్ గౌడ్, ఐల శ్రీనివాస్ గౌడ్, జీ.రాజేశం,ప్రసాద్, మురళి కృష్ణ, కృష్ణ చైతన్య ప్రాఖ్య, సరిత శ్రీనివాస్, చిన్నమ్మ, రాజా మిధుల్, ప్రశాంత్ గౌలికర్, ఫణి మాల, కార్తీక్ మనికొండ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.