BJP జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌

బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం

హైదరాబాద్‌, జూలై 29, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో అధికారం దక్కించుకోవడం బీజేపీ అనేక వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించి.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. బీజేపీ పార్టీకి తెలంగాణలో ఒక ఊపు తెచ్చిన బండి సంజయ్‌ను ఈ బాధ్యతల నుంచి తప్పించడంపై చాలా మంది కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. అయితే బండి సంజయ్‌కు మరో పదవి ఇస్తారని ఇటీవల జోరుగా ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. బీజీపీ జాతీయ నాయకత్వంలోకి బండి సంజయ్‌ను ఆహ్వానించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనకి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కమల అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై బండి సంజయ్‌ అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలిగా తెలంగాణ నుంచి డీకే అరుణ కొనసాగనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్య కమార్‌ కొనసాగనున్నట్లు అధిష్ఠానం ప్రకటించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీ కి బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రం నుంచే మరో లీడర్‌ డీకే అరుణకి కూడా జాతీయకార్యవర్గంలో మరోసారి చోటు లభించింది. ఆమెను జాతీయ ఉపాధ్యక్షరాలిగా కొనసాగిస్తున్నారు. ఏపీ నుంచి సత్యకుమార్‌ను ప్రధాన కార్యదకి ర్శిగా కొనసాగిస్తున్నారు. ఆయన్ని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పురందేశ్వరిని అధ్యక్షురాలిగా చేసింది అధినాయకత్వం. అందుకే సత్య కుమార్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా కంటిన్యూ చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....