BJP పట్టణ ఉపాద్యక్షురాలిగా మల్లీశ్వరి

జగిత్యాల, అక్టోబర్‌ 29 (ఇయ్యాల తెలంగాణ );భారతీయ జనతాపార్టీ జగిత్యాల పట్టణ ఉపద్యక్షురాలిగా బండపెల్లి మల్లీశ్వరిని నియమిస్తూ పట్టణ అధ్యక్షులు వీరబత్తిని అనీల్‌ కుమార్‌ నియమక పత్రాన్ని అందజేశారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పట్టణ అద్యక్షులు అనీల్‌ పేర్కొన్నారు.  ఈ సందర్భంగా బండ పెల్లి మల్లేశ్వరి మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుకోసం నిరంతరం  కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ఎంపీ అర్వింద్‌, జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రావు, బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి భోగ శ్రావణి, పట్టణ అద్యక్షులు అనీల్‌ లకు మల్లీశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ కార్యదర్శి ఆముద రాజు, లింగంపేట రాజన్న, ఉపాధ్యక్షులు మల్లేశం, గాదాసు రాజేందర్‌, కోశాధికారి కొక్కిన సత్తన్న తోపాటు కార్యకర్తలు ఉన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....