BJP సొంత మేజిక్‌ ఫిగర్‌ దాటకపోవడంతో – NDA మంత్రివర్గ శాఖలపై కసరత్తు !

న్యూఢిల్లీ, జూన్‌ 6 (ఇయ్యాల తెలంగాణ) : లోక్‌సభ ఎన్నికల్లో 240 సీట్ల సాధించిన భారతీయ జనతా పార్టీ సొంతంగా మేజిక్‌ ఫిగర్‌ దాటకపోవడంతో.. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్డీయే పక్షాలను ప్రభుత్వంలో భాగం చేసే క్రమంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి.. ఏయే శాఖలు కేటాయించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది.ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహిస్తోంది బీజేపీ. ఉదయం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కానున్నారు బీజేపీ పెద్దలు. ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎన్డీయే ఎంపీలతో విూటింగ్‌ జరగనుంది. ఇప్పటికే ఎన్డీయే కూటమి నాయకుడిగా ఏకగ్రీవంగా మోడీని ఎంపీక చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు, నితీశ్‌ కుమార్‌ తోపాటు 23 పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇక రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించమని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు కోరనున్నారు. 

మరోవైపు కూటమిని విస్తరించే అంశంపైనా బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. దేశవ్యాప్తంగా గెలిచిన స్వతంత్ర ఎంపీలతో పాటు తటస్థ పార్టీలను ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ అగ్రనాయకత్వం. అమిత్‌ షా తోపాటు రాజ్‌నాథ్‌సింగ్‌కి ఈ బాధ్యతలు అప్పగించింది బీజేపీ.ఆదివారం (జూన్‌ 9) సాయంత్రం 6 గంటలకు మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నారు నరేంద్రమోదీ. కేబినెట్‌ కూర్పుపై దృష్టి సారించారు మోదీ. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాఖల కేటాయింపులపై చర్చించినట్లు సమాచారం. అయితే కీలక శాఖలైన హోంశాఖ, రక్షణశాఖ , ఆర్ధికశాఖ , రైల్వే శాఖ , విదేశాంగ శాఖలను తమ దగ్గరే ఉంచుకోవాలని బీజేపీ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలు ఈ శాఖలపై ఎలాంటి ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గవద్దని బీజేపీ నేతలు నిర్ణయించినట్టు సమాచారం.స్పీకర్‌ పదవిని కూడా మిత్రపక్షాలకు ఇవ్వరాదని బీజేపీ నేతలు నిర్ణయించారు. టీడీపీకి పౌర విమానయానశాఖ , ఉక్కు శాఖ ఇచ్చే అవకాశం ఉంది. గ్రావిూణాభివృద్ది శాఖ , పంచాయతీరాజ్‌ శాఖలు జేడీయూకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. శివసేన షిండే వర్గానికి పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశం ఉంది. జేడీఎస్‌కు వ్యవసాయశాఖ ఇచ్చే అవకాశం ఉంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....