BJP MP రఘునందన్‌రావుకు బెదిరింపు కాల్‌

హైదరాబాద్‌ జూన్‌ 23 (ఇయ్యాల తెలంగాణ) : : బిజెపి ఎంపి రఘునందన్‌రావుకు బెదిరింపు కాల్‌ వచ్చింది. ఆయన్ను సాయంత్రంలోగా చంపేస్తామంటూ పీపుల్‌ వార్‌ మావోయిస్టుల పేరుతో ఫోన్‌ చేసి బెదిరించారు. ఈ ఫోన్‌ కాల్‌ను రఘునందన్‌రావు పిఎ ఎత్తాడు. తాను మధ్యప్రదేశ్‌కి చెందిన మావోయిస్టునని ఆగంతకుడు చెప్పాడు. దమ్ముంటే కాపాడుకోండని రఘునందన్‌ను అతడు బెదిరించాడు.మేడ్చల్‌ జిల్లాలోని దమ్మాయి గూడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపి రఘునందన్‌   పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆయనకు బెదిరింపు కాల్‌ వచ్చింది. వెంటనే రఘునందన్‌ రావు అప్రమత్తమై తెలంగాణ డిజిపి జితేందర్‌, సంగారెడ్డి ఎస్పి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ 912143352974 అనే నెంబర్‌ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఎంపి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్‌ వచ్చిన నెంబర్‌ ఆధారంగా విచారణ చేస్తున్నారు. కాల్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....