బొమ్మరిల్లు తర్వాత అలాంటి ఫాదర్‌`సన్‌ బ్యూటిఫుల్‌ Emotion

హీరో సిద్ధార్థ్‌ 40వ మూవీ ‘3 ఃఊఐ’. శ్రీ గణేష్‌ దర్శకత్వం వహించారు. పోస్టర్లు, టీజర్లు, పాటలతో సినిమా మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగి బాబు, విూతా రఘునాథ్‌,  చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్‌ బ్యానర్‌పై అరుణ్‌ విశ్వ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ ఈరోజు విడుదలైంది.

ఇల్లు సొంతం చేసుకోవాలనే జీవితకాల కల కలిగిన మధ్యతరగతి కుటుంబ భావోద్వేగ ప్రయాణంలో ఈ ట్రైలర్‌ మనసుని హత్తుకుంది. జీవితంలో వైఫల్యాలు, నిరాశలను ఎదుర్కొన్న తండ్రి, కుటుంబం ఆకాంక్షలను నెరవేర్చడానికి తన కొడుకుపై తన ఆశలన్నింటినీ ఉంచుతాడు. అయితే, చదువు పరంగా కష్టపడుతూ, అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ 34 సంవత్సరాల వయస్సులో కూడా ఉద్యోగం లేకుండా ఉన్న కొడుకు భావోద్వేగ ప్రయాణం చాలా ఎమోషనల్‌ గా వుంది. ఆ కుటుంబం కల చివరకు సాకారం అవుతుందా లేదా అనేది చాలా ఆసక్తిని పెంచింది.

ఇల్లు కొనడం అనేది మధ్యతరగతి కుటుంబాల కల. ఈ కథ అందరికీ కనెక్ట్‌ అయ్యేలా వుంది. దర్శకుడు శ్రీ గణేష్‌ భావోద్వేగపరంగా హృదయాన్ని తాకే  కథనంతో తన మ్యాజిక్‌ ని ప్రజెంట్‌ చేశాడు.

సిద్ధార్థ్‌ తన పాత్రలో ఒదిగిపోయాడు. తన పెర్ఫార్మెన్స్‌ అద్భుతంగా వుంది. తన కుటుంబం ఆనందం, భద్రత గురించి మాత్రమే కలలు కనే ఒక సాధారణ మధ్యతరగతి 

తండ్రి పాత్రను శరత్‌ కుమార్‌ చాలా చక్కగా పోషించారు. కథకు భావోద్వేగాన్ని జోడిరచే ఆకట్టుకునే నటనతో  దేవయాని, విూతా రఘునాథ్‌ , చైత్ర ఆకట్టుకున్నారు.

సినిమాటోగ్రాఫర్లు దినేష్‌ కృష్ణన్‌ బి, జితిన్‌ స్టానిస్లాస్‌  విజువల్స్‌ మధ్యతరగతి జీవితాన్ని అందంగా చూపించాయి. ప్రతి ఫ్రేమ్‌ నేచురల్‌ గా వుంది. అమృత్‌ రామ్‌నాథ్‌ నేపథ్య సంగీతం ఎమోషన్‌ ని మరింత పెంచుతుంది. నిర్మాణ విలువలు టాప్‌ క్యాలిటీలో వున్నాయి.

గణేష్‌ శివ రాసిన స్క్రీన్‌ ప్లే, రాకేందు మౌళి సంభాషణలు అద్భుతంగా వున్నాయి. వినోద్‌ రాజ్‌ కుమార్‌ ఎన్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌. ఆర్‌. సిబి మారప్పన్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యుసర్‌.  ట్రైలర్‌ సినిమాపై అంచనాలని పెంచింది. జూలై 4న ఈ చిత్రం గ్రాండ్‌ గా విడుదల కానుంది.  

ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్లో  హీరో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.3 బీహెచ్‌కే మూవీ ఫ్యామిలీని విూకు పరిచయం చేయాలి. అరుణ్‌ విశ్వా ఎక్సైటింగ్‌ ప్రొడ్యూసర్‌. ఈ సినిమా ఒక రియల్‌ లైఫ్‌ నుంచి వచ్చిన కథ. ఈ సినిమా చూసిన తర్వాత వెంటనే మా నాన్నని గట్టిగా హగ్‌ చేసుకోవాలని అనిపించింది. తండ్రి కొడుకుల రిలేషన్షిప్‌ ని బొమ్మరిల్లు సినిమాల్లో చూశారు. ఆ సినిమా నాకు చాలా నేర్పించింది. అలాంటి సినిమా తర్వాత మళ్ళీ తండ్రి కొడుకుల రిలేషన్షిప్‌ 3 బీహెచ్‌కే లో చూస్తారు. ఈ సినిమా చూసినప్పుడు నాకు ఎలాంటి అనుభూతి కలిగిందో విూకు కూడా ఆ అనుభూతి కలుగుతుందని భావిస్తున్నాను. విూ ఫ్యామిలీని తీసుకుని థియేటర్స్‌ కి వెళ్ళండి. వాళ్ళని హగ్‌ చేసుకోవడానికి విూ పక్కనే ఉంటారు. శ్రీ గణేష్‌ ఎక్స్ట్రార్డినరీ రైటర్‌ డైరెక్టర్‌. తను ఈ కథ చెప్పినప్పుడే చాలా ఎమోషనల్‌ గా అనిపించింది. సొంత ఇల్లు అందరి కల. నేను కూడా చిన్నప్పుడు మా సొంతిల్లు కోసం ఎదురు చూశాను. మనందరం అలాంటి మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌ నుంచే వచ్చాము. ఈ సినిమాలో మెయిన్‌ క్యారెక్టర్‌ ఇల్లు. అందులో మెయిన్‌ క్యారెక్టర్స్‌ శరత్‌ కుమార్‌ గారు దేవయాని  గారు. వాళ్లు ఈ సినిమాలో నటించడం మర్చిపోలేని అదృష్టం. ఇది నా 40వ సినిమా. అలాంటి సినిమాలో ఇంత మంచి యాక్టర్స్‌ ఉండటం నా అదృష్టం. నా వాల్యూని తెలుగు ప్రేక్షకులే మొదటి చూశారు. ఎప్పుడు కూడా వారే గొప్ప ప్రేమని చూపించా.రు అది ఎప్పటికి మారదు. మారకూడదు. ఇది ఒక బ్యూటిఫుల్‌ ఫ్యామిలీ స్టోరీ. విూకు ట్రైలర్‌ నచ్చితే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా ప్రేమతో ఈ సినిమా తీశాం. చైత్ర మిత్ర అందరూ విూ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక హానెస్ట్‌ ఫ్యామిలీ ఫిలిం తీయడం చాలా కష్టం. అలాంటి మంచి సినిమా ఇది. మంచి ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా. ఇందులో మంచి హోప్‌ ఉంది. థియేటర్‌ నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఒక పాజిటివ్‌ హోప్‌ తో వెళ్తారు. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్‌ అందరికీ థాంక్యూ. చాలా ప్రేమతో పని చేశారు. ప్రొడ్యూసర్‌ అరుణ్‌ ఇప్పుడు ఉంటున్న ఇల్లు గతంలో కళాతపస్వి కె విశ్వనాథ్‌ గారు ఉండేవారు. ఈ సినిమాని కళాతపస్వి కె.విశ్వనాథ్‌ గారికి అంకితం చేస్తున్నాం. సినిమాని రిలీజ్‌ చేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూషన్‌ వారికి ధన్యవాదాలు. ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్‌. ఇల్లు అనేది ఒక డ్రీమ్‌. అలాంటి ఎమోషన్స్‌ ని ఈ సినిమా విూ అందరికీ ఇస్తుంది. జూలై 4న తప్పకుండా విూరందరూ ఆ ఎమోషన్‌ ని ఎక్స్పీరియన్స్‌ చేస్తారు. విూ అందరి ప్రేమకి థాంక్యూ’అన్నారు.  

యాక్టర్‌ శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. డైరెక్టర్‌ శ్రీ గణేష్‌, ప్రొడ్యూసర్‌ విశ్వ గారికి థాంక్యూ. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న శశి గారికి థాంక్యూ. సిద్దు, దేవయాని, చైత్ర అందరితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా రియల్‌ లైఫ్‌ కి చాలా కనెక్ట్‌ అయ్యే సినిమా. మనందరం కూడా ఒక మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఇల్లు అనేది అందరి కల.ఈ సినిమాతో చాలా రిలేట్‌ అవుతున్నాను. ఇల్లు కట్టాలని అందరికీ యాంబిషన్‌ ఉంటుంది. ఇల్లు అనేది ఒక గౌరవం. ఈ సినిమాని ఒక ఫ్యామిలీ లానే వర్క్‌ చేసాం. చాలా మంచి వర్క్‌ చేసాం. అది ఎలా ఉందో విూరే చెప్పాలి. ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చుని చూడదగ్గ సినిమా ఇది. ఈ సినిమాలో యాక్టర్లు కాదు క్యారెక్టర్లే కనిపిస్తాయి. తప్పకుండా ఈ సినిమా చూసి విూరందరూ సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటున్నాను.

డైరెక్టర్‌ శ్రీ గణేష్‌ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. నేను తెలుగు మాట్లాడలేని గాని చాలా తెలుగు సినిమాలు చూశాను. నాకు తెలుగు అర్థం అయిపోతుంది. అదే సినిమాకు ఉన్న బ్యూటీ. మా టీమ్‌ అందరికీ థాంక్యు. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ముందు తీసుకురావడం నాకు ఒక బిగ్‌ అచీవ్మెంట్‌. ఇది నాకు  మెమొరబుల్‌ థింగ్‌. చాలా ప్రేమతో ఈ సినిమా తీశాం. విూరందరూ కూడా చూసి అంత ప్రేమ మాకు అందిస్తారని కోరుకుంటున్నాం. మా సినిమాని రిలీజ్‌ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌ కి థాంక్యూ. తెలుగులో బొమ్మరిల్లు  అందరికీ కనెక్ట్‌ అయింది ఈ సినిమా కూడా అందరికీ కనెక్ట్‌ అవుతుందని నమ్మకం ఉందని సిద్ధార్థ్‌ గారు చెప్పారు. అలాగే మా సినిమాకి కూడా మంచి సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను.

దేవయాని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది చాలా అద్భుతమైన కథ. చాలా మంచి సందేశం ఉంది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్‌ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌ కి థాంక్యూ. తెలుగు ఆడియన్స్‌ మంచి కథల్ని ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తారు. ఇది చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌. తప్పకుండా సినిమాని సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ గా విూ అందరిని ఈ సినిమాకి ఇన్వైట్‌ చేస్తున్నాం. మా గృహప్రవేశానికి విూరందరూ రావాలి. (నవ్వుతూ) అందరికీ థాంక్యు’అన్నారు  

ప్రొడ్యూసర్‌ అరుణ్‌ విశ్వ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. మైత్రి డిస్ట్రిబ్యూషన్‌ లో ఈ సినిమా రిలీజ్‌ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్‌ కి థాంక్యూ.  ఇంతకుముందు మహావీరుడు చేశాను. ఆ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా తెలుగు నుంచి వచ్చిన రెస్పాన్స్‌ స్పెషల్‌ ఫీలింగు. ఈ సినిమా కూడా అంతకంటే మంచి రెస్పాన్స్‌ తీసుకొస్తుందని నమ్మకం ఉంది. ఈ పాత్రను చేసిన  సిద్ధార్థ కి థాంక్యూ.  తను నాకు బ్రదర్‌ లాంటి వారు. శరత్‌ కుమార్‌ గారికి దేవయాని గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. శ్రీ గణేష్‌ చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు. ఈ సినిమా నా జీవితం లో ఎప్పటికీ మెమొరబుల్‌ గా నిలిచిపోతుంది.  

మైత్రి డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి మాట్లాడుతూ…  అందరికి నమస్కారం. ప్రతి ఒక్కరి కల సొంత ఇల్లు. ఈ సినిమా ప్రతి ఇంటి గడప తలుపు తడుతుందని అనుకుంటున్నాను. అరుణ్‌ విశ్వ గారు మాకు రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్‌ ఇవ్వడం ఆనందంగా ఉంది. తప్పకుండా మా విూద పెట్టిన బాధ్యతని మేము నిర్వహిస్తాము. సిద్ధార్థ గారి బొమ్మరిల్లు మా లతా థియేటర్లో 50 రోజులు ఆడిరది. కన్నప్ప బ్లాక్‌ బస్టర్‌ అయింది. ఇప్పుడు రాబోతున్న 3 బీహెచ్‌కే కూడా అదే వరుసలో బ్లాక్‌ బస్టర్‌ కాబోతుంది. ఈ సినిమా పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తుందని అనుకుంటున్నాను. ట్రైలర్‌ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. జులై 4 మే రిలీజ్‌ అవుతుంది.  ప్రతి ఒక్కరు థియేటర్స్‌ లోకి వచ్చి ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యు’అన్నారు. ఈ ఈవెంట్‌ లో మూవీ యూనిట్‌ అంతా పాల్గొన్నారు.

తారాగణం: సిద్ధార్థ్‌, శరత్‌ కుమార్‌, దేవయాని, యోగి బాబు, విూతా రఘునాథ్‌, చైత్ర  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....