బోనాల జాతర వృత్తిదారుల సంఘం నూతన కార్యవర్గం

 హైదరాబాద్, మే 20 (ఇయ్యాల తెలంగాణ) : బోనాల వేడుకలను పురస్కరించుకొని పాతబస్తీ  ఉమ్మడి దేవాలయాల వృత్తిదారుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. ఇందులో భాగంగా ఫూల్ బాగ్ లాల్ దర్వాజాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో  ఉమ్మడి దేవయాల వృత్తిదారుల సంఘం నూతన కమిటీ ఎన్నుకొన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఉన్న కమిటీ నిర్వాహకులనే ఈ సంవత్సరం కూడా కోనసాగడానికి కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ మేరకు నూతన అధ్యక్ష పదవికి పేరోజి మహేశ్వర్,  ప్రధాన కార్యదర్శిగా కొల్లూరు జ్ఞానేశ్వర్ కోశాధికారిగా గట్టు సుదర్శన్ లను కమిటీ సభ్యుల సమక్షంలో ఎకగ్రీంగా ఎన్నుకున్నారు.  గత ఆరు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలతో ప్రతి ఏటా బోనాల ఉత్సవ వేడుకలకు వృత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో అనేక రకాలుగా డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఉమ్మడి దేవాలయాల వృత్తిదారుల సంఘం సభ్యులు కులవృత్తి దారుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనాదిగా పూర్వీకుల నుంచి వంశ పారంపర్యంగా  తెలంగాణలో ఉన్నతమైన పండుగగా కీర్తి గడించిన బోనాల పండుగకు వృత్తిదారుల సంఘం సభ్యులు అనేక సమస్యలతో ప్రభుత్వాలకు వినతులు అందించడం జరిగింది. ప్రస్తుతము  బోనాల పండుగకు సరైన బోనాల సమర్పణ లేకుండా పోతున్నదని సరైన ఆచార వ్యవహారాలతో కూడిన బోనాల పండుగను నిర్వహించ లేకపోతున్నట్లు వృత్తి దారుల సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన పద్ధతులు లేకుండా ఇష్టం వచ్చినట్టు గ్రామదేవతలకు జరపాల్సిన పూజలు  జరపలేక పోతున్నట్లు తెలిపారు. వృత్తిదారుల సంఘం సరైన ఆచార వ్యవహారాలతో పూర్వికులు చూపించిన మాగంలోనే నడుస్తూ అనేక పూజ కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. మరో సరి తమపై నమ్మకంతో వృత్తి దారుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న సందర్బంగా ప్రత్యేక కృతజ్నతలు తెలియ జేశారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....