Boudha Nagar Division పరిధిలో రూ.4 కోట్ల పనులకు శ్రీకారం

        అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగింపు

       – డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు గౌడ్‌

సికింద్రాబాద్‌, సెప్టెంబరు 11 (ఇయ్యాల తెలంగాణ) :  డిప్యూటీ స్పీకర్‌ తీగుల్ల పద్మారావు గౌడ్‌ సోమవారం సికింద్రాబాద్‌ నియోజకవర్గం లోని బౌద్దనగర్‌ డివిజన్‌ లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా రూ.4  కోట్ల ఖర్చుతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్‌ కంది శైలజ, అధికారులు, నేతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం  పద్మారావు గౌడ్‌ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి తాము పాటు పడుతున్నామని, సికింద్రాబాద్‌ ను అభివృద్దిలో రాష్ట్రంలో అగ్ర స్థానంలో నిలుపుతున్నామని తెలిపారు. అలాగే రాఘవ గార్డెన్స్‌, పార్సీ గుట్ట, సంజీవ పురం, అంబర్‌ నగర్‌, బౌద్దనగర్‌, వారసిగూడ, అశోక్‌ నగర్‌,   కౌసర్‌ మసీద్‌ తదితర ప్రాంతాల్లో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ పాదయాత్ర సాగింది. స్థానికులు ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు.   డబుల్‌ బెడ్‌ రూమ్‌ ల కేటాయింపును   పారదర్శకంగా నిర్వహిస్తున్నామని  పద్మారావు గౌడ్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.     ఈ సందర్భంగా  అశోక్‌ నగర్‌ లో రూ.52 లక్షలతో మంచి నీటి పైప్‌ లైన్‌ నిర్మాణం, రూ.5 లక్షలతో సివరేజి లైన్ల పునర్నిర్మాణం, అంబర్‌ నగర్‌ లో  రూ.6 లక్షలతో సివరేజి లైన్ల ఏర్పాటు,  అపోలో గ్రామర్‌ స్కూల్‌ వద్ద రూ.45 లక్షలతో సీ సీ రోడ్డు నిర్మాణం పనులు, రాజీవ్‌ నగర్‌, రాఘవ గార్డెన్స్‌ వెనుక భాగంలో రూ. 32. 40 లక్షలతో సీ సీ రోడ్డు నిర్మాణం పనులు, కౌసర్‌ మసీదు సవిూపంలో రూ.1.86 కోట్లతో నాలా పునర్నిర్మాణం పనులు, బౌద్దనగర్‌ లో రూ.36 లక్షలతో సీ సీ రోడ్డు నిర్మాణం పనులను డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ ప్రారంభించారు.ఈ కార్యక్రం లో డివిజన్‌ బీ ఆర్‌ ఎస్‌ నాయకులు కిషోర్‌ కుమార్‌, కంది నారాయణలతో పాటు బల్లగీత ,సుమలత,చింత కింది సుజాత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....