`బ్రెస్ట్‌ Cancer ను ముందుగానే గుర్తించడం ద్వారా సులభంగా నివారించవచ్చు:

ప్రెస్‌ విూట్‌ లో అపోలో హాస్పిటల్స్‌ సీఎస్‌ఆర్‌ విభాగం వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఉపాసన కామినేని కొణిదెల

`ఫ్యూజీ ఫిలిం ` అపోలో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవేర్నెస్‌ క్యాంపెయిన్‌ లాంచ్‌

`ఉపాసన కామినేని కొణిదెలను బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవేర్నెస్‌ క్యాంపెయిన్‌ ప్రచారకర్తగా నియమించిన ఫ్యూజిఫిల్మ్‌ ఇండియా

`రొమ్ము క్యాన్సర్‌ అవగాహన సీఎస్‌ఆర్‌ ప్రచారానికి తన పూర్తి మద్దతు ప్రకటించిన అపోలో హాస్పిటల్స్‌ సీఎస్‌ఆర్‌ విభాగం వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఉపాసనా కామినేని కొణిదెల

` దేశవ్యాప్తంగా 24 నగరాల్లో ప్రచారం, అమలు ఏజెన్సీగా అపోలో ఫౌండేషన్‌

` రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన పెంచి, మహిళలు తమ ఆరోగ్యం గురించి పట్టించుకునేలా స్ఫూర్తినివ్వడమే సీఎస్‌ఆర్‌ ప్రచార ఉద్దేశం

హైదరాబాద్‌, జూన్‌ 11, 2025: హెల్త్‌ కేర్‌ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఫ్యూజీఫిల్మ్‌ ఇండియా తాజాగా ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే సీఎస్‌ఆర్‌ ప్రచారం ప్రారంభించింది. అపోలో హాస్పిటల్స్‌ సీఎస్‌ఆర్‌ విభాగం వైస్‌ ఛైర్‌పర్సన్‌  ఉపాసనా కామినేని కొణిదెల దీన్ని ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించి, దాన్ని త్వరగా గుర్తించాల్సిన అవసరంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టిసారిస్తుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై కొన్ని అపోహలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రచారం ముమ్మరంగా చేస్తారు.

దేశంలోని 24 నగరాల్లో ఈ ప్రచారం ఉంటుంది. ఇది మొత్తం 1.5 లక్షల మంది మహిళలను చేరుకుంటుంది. నిర్మాణాత్మక సమాజ భాగస్వామ్యం, ఆరోగ్య ముప్పు అంచనాలతో శిక్షణ పొందిన క్షేత్రస్థాయి సిబ్బంది ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని అపోలో ఫౌండేషన్‌ అమలు చేస్తోంది. ఆరోగ్యంపై అవగాహన కలిగిన సమాజాన్ని నిర్మించడంలో ఫ్యూజిఫిల్మ్‌ ఇండియా నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.

భారతీయ మహిళల్లో చాలా ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్‌ ప్రధానమైనది. ఐసీఎంఆర్‌ వారి జాతీయ క్యాన్సర్‌ రిజిస్ట్రీ అంచనాల ప్రకారం, మహిళలకు వచ్చే మొత్తం క్యాన్సర్లలో 14% ఇదే ఉంటోంది. ప్రతి 29 మంది మహిళల్లో ఒకరికి జీవితకాలంలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు, తగినంత అవగాహన లేకపోవడం, అపోహలు, సరైన వైద్యసదుపాయం అందుబాటులో లేకపోవడంతో చాలా కేసులను ఆలస్యంగా గుర్తిస్తున్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకే ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక స్థాయిలో నమ్మదగిన, సాంస్కృతికంగా సున్నితమైన సమాచారాన్ని అందించేలా ఇది ఉంటుంది. గౌరవప్రదమైన బహిరంగ చర్చలు, వర్క్‌షాప్‌లు, అవగాహన సదస్సులు నిర్వహించి, మహిళలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించేలా ఇది చూస్తుంది. తద్వారా వారు తమ లక్షణాలను త్వరగా గుర్తించి, స్వీయ పరీక్షల ద్వారా అర్థం చేసుకుని, సరైన సమయానికి చికిత్సలు పొందేలా చూస్తారు.

ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్‌ సీఎస్‌ఆర్‌ విభాగం వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఉపాసన కామినేని కొణిదెల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మహిళలు, ఆరోగ్యం, మార్పు కోసం మా వెంట నిలబడ్డ అందరికీ థాంక్‌ యూ. మహిళలు భయపడకుండా, గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక. ఈ రోజు మనం ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టుతున్నాం. టెక్నాలజీని సాధారణ మహిళల జీవితాల్లోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఆరోగ్య వ్యవస్థను ఒక ఉద్యమంగా మార్చే మొదటి అడుగు ఇది.

భారత్‌లో ప్రతి 4 నిమిషాలకు ఒక మహిళకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడుతోంది. ప్రతి 13 నిమిషాలకు ఒక మహిళ ఈ కారణంగా ప్రాణాలు కోల్పోతుంది. భారత మహిళల్లో 50 శాతం మందికి పైగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ లేటు స్టేజ్‌ గుర్తించబడుతుంది. ఇది ముఖ్యంగా స్క్రీనింగ్‌  తగిన సేవలు లేని సముదాయాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. నేషనల్‌  బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవేర్నెస్‌ క్యాంపెయిన్‌ ద్వారా ట్రైన్డ్‌ హెల్త్‌కేర్‌ వర్కర్లు ఇప్పుడు నేరుగా మహిళల వద్దకు వెళ్లనున్నారు. నిర్మాణ ప్రాంతాలు, పట్టణాల శివార్లలోని బస్తీలు, తక్కువ ఆదాయ గల కుటుంబాల వద్దకు వెళ్లి సేవలు అందించనున్నారు. దేశంలో 24 రాష్ట్రాల్లో దాదాపు 1.5 లక్షల మహిళలకు ఈ సేవలు అందనున్నాయి.

తమిళనాడు అరగొండలోని పైలెట్‌ ప్రోగ్రమ్‌ ద్వారాఅనేక మహిళలకు సేవలు అందించగలిగాం. దీని ద్వారా 150 ప్రాణాలు కాపాడగలిగాం. ఇది చారిటీ కాదు మా బాధ్యత. సెల్ఫ్‌ ఎగ్జామ్స్‌ అనేది చెడుగా భావించాల్సినవి కాదు. మనము బ్లడ్‌ షుగర్‌ గురించి ఎంత సాదారణంగా మాట్లాడగలగుతుమో అలాగే బ్రెస్ట్‌ హెల్త్‌ గురించీ మాట్లాడాలి. అవగాహన కల్పించాలి. డాక్టర్లు, జర్నలిస్టులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, కమ్యూనిటీ లీడర్లు..విూ అనుభవాలను షేర్‌ చేయండి. ఒక మార్పు ప్రారంభం కావాలి. అపోలో ఫౌండేషన్‌లో పని చేయడం, దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. దయచేసి మహిళలు ముందుగా స్క్రీనింగ్‌ చేయించుకునేలా ప్రోత్సహించండి. అందరికీ నా ధన్యవాదాలు. 

ఫ్యూజిఫిల్మ్‌ ఇండియా మేనిజింగ్‌ డైరెక్టర్‌ కోజి వాడా మాట్లాడుతూ.. త్వరగా గుర్తించడం, అవగాహన ద్వారా బ్రెస్ట్‌  క్యాన్సర్‌ ని నివారించవచ్చు.  ‘‘ఈతినిట తిబి ఇజీతీశ్రీవ. ఈతిణష్ట్రబి తిబి ఇజీతీశ్రీవ’’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతుతున్నాం. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఈ ప్రచారంతో మహిళలకు తగిన అవగాహన కల్పించి, ఈ వ్యాధిని త్వరగా గుర్తించి, వీలైనన్ని ప్రాణాలను కాపాడాలన్నదే మా లక్ష్యం’అన్నారు.

తన సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల ద్వారా ఫ్యూజిఫిల్మ్‌ ఇండియా సంస్థ ఆరోగ్య సంరక్షణను అందరికీ మరింత అందుబాటులో ఉండేలా చూస్తోంది. ఇప్పటివరకు ఇవి అందనివారికి అందించడం, త్వరగా గుర్తించడం, అవగాహన ద్వారా దాన్ని నివారించే చర్యలు చేపట్టడం కూడా ఇందులో భాగమే. ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే ప్రచారం.. ఫ్యూజిఫిల్మ్‌ గ్రూప్‌ సస్టెయినబుల్‌ వాల్యూ 2030 ప్రణాళికకు అనుగుణంగా ఉంది. వైద్యం అందరికీ సమానంగా అందాలని, ఇప్పటివరకు అందనివారికి అందించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం. ప్రభావం బాగా అవసరమైన చోట సేవలు అందించడం ద్వారా ఈ ప్రపంచానికి మరిన్ని నవ్వులు అందించడాలన్న కంపెనీ గ్రూప్‌ లక్ష్యాన్ని ఈ ప్రచారం ప్రతిబింబిస్తుంది. అది ఒక మారుమూల పట్టణమైనా, జనసాంద్రత ఎక్కువగా ఉండే నగరమైనా.. ప్రతి మహిళకూ తన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు, దాన్ని రక్షించుకోవడానికి తగిన అవకాశం ఉండాలని ఫ్యూజిఫిల్మ్‌ ఇండియా భావిస్తుంది

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....