BRSకు సుప్రీం షాక్‌

న్యూఢల్లీ, అక్టోబరు 20, (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు తప్పించాలంటూ బీఆర్‌ఎస్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది  ఓటర్లకు అన్నీ తెలుసని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో బీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌ తగిలినట్టయ్యింది. సుప్రీం నిర్ణయంతో బీఆర్‌ఎస్‌ అధిష్టానం, ఆ పార్టీ అభ్యర్థులు ఆలోచనలో పడినట్లు తెలిసింది. ‘భారతీయ ఓటర్లు రాజకీయ నిరక్షరాసులు కాదు. ఓటర్లకు కారు, చపాతి రోలర్‌, రోడ్డు రోలర్‌ తేడా తెలియదు అనుకుంటున్నారా?.. ఎన్నికలు వాయిదా వేయాలని విూరు కోరుకుంటున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

కారును పోలిన గుర్తులను తొలగించాలంటూ న్యాయస్థానంలో బీఆర్‌ఎస్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. చపాతీ రోలర్‌, రోడ్డు రోలర్‌, తదితర గుర్తులను ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకుండా ఎన్నికల సంఘానికి ఆదేశించాలంటూ బీఆర్‌ఎస్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులతో నష్టపోయామని పిటిషన్‌లో పేర్కొంది. ఈ అంశంపై గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినా సానుకూల తీర్పు రాలేదు. అయితే హైకోర్టు తీర్పు తర్వాత దాదాపు 240 రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు రావడం ఏంటి?. అధికార పార్టీగా ఉన్న విూకు ఈ విషయం తెలియదా?’ అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాయవాదులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిథాల్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....