BRSతో కలిసేదే లేదు కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణాలో అసీంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలలో భయం ఎక్కువవుతోంది. ఈసారి జరగనున్న ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకం కానున్నాయి. ఒకవేళ కేసీఆర్‌ సారధ్యంలోని బీఆర్‌ఎస్‌  మళ్ళీ గెలిస్తే ఇక బీజేపీ, కాంగ్రెస్‌ లు తట్ట బుట్ట సర్దుకోవాల్సిందే, భవిష్యత్తులో ఇక కేసీఆర్‌ ను టచ్‌ చేసే అవకాశమే ఉండదు. అందుకే కాంగ్రెస్‌ మరియు బీజేపీలు గట్టిగా కేసీఆర్‌ ను ఓడిరచాలని విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ మాపై ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ , బీజేపీ  లు కలిసి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇది ముమ్మాటికీ తప్పు ప్రచారమేనని కిషన్‌ రెడ్డి గట్టిగా చెప్పారు. తెలంగాణాలో మా పోరు ఏకపక్షముగానే సాగుతుందని.. ఎవ్వరితోనూ పొత్తులు పెట్టుకోవలసిన అవసరం లేదన్నారు కిషన్‌ రెడ్డి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....