BRSలోకి..కాంగ్రెస్‌ వరుస వలసలు

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ):కాంగ్రెస్‌ టికెట్ల వ్యవహారంలో వివాదాలు ఇంకా సద్దుమణగలేదు. ఆశాభంగం చెందిన సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నారు. అసంతృప్తి నేతలు అధికార పార్టీలో చేరుతుననారు.  మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు నాగం జనార్ధన్‌  రెడ్డి ఇంటికెళ్లి మరీ అయనను బీఆర్‌ఎస్‌ లోకి ఆహ్వానించారు. ఈ నేపధ్యంలో నాగం ప్రగతి భవన్‌ వెళ్లి సీఎం కేసీఆర్‌ ను కలిసారు. నాగం లో పార్టీలో సముచిత స్థానం ఇస్తామని సీఎం కేసీఆర్‌ నాగంకు హావిూ ఇచ్చినట్లు సమాచారం. అలాగే, జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌ ను కలిపారు.  సోమవారం నాడు మంత్రి హరీష్‌ రావు విష్ణువర్ధన్‌ రెడ్డిని అయన నివాసంలో కలిసారు. పాలమూరు కాంగ్రెస్‌ నేత ఎర్ర శేఖర్‌ కు గులాబీ కండువా కప్పుకున్నారు. బీజేపీ నేత పీ చంద్రశేఖర్‌ కుడా బీఆర్‌ఎస్‌ లో చేరడానికి సిద్ధమైనట్లు సమాచారం.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....