BRS పార్టీలో చేరిన నాగం జనార్ధన్‌ రెడ్డి

హైదరాబాద్‌ అక్టోబర్‌ 31 (ఇయ్యాల తెలంగాణ ); మాజీ మంత్రి నాగం జనార్ధన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా నాగం జనార్ధన్‌ రెడ్డికి కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగం మద్దతుదారులు కూడా భారీ సంఖ్యలో కారెక్కారు.సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాగం జనార్దన్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్‌ హయాంలో ఓబులాపురం మైనింగ్‌ కుంభకోణంపై పోరాటం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. బీజేపీలో కొంతకాలం పనిచేశారు. తరువాత ‘తెలంగాణ నగారా’ పార్టీని స్థాపించారు. ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ బీఆర్‌ఎస్‌లో చేరారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....