BRS పార్టీలో KCR కుటుంబసభ్యులు తప్ప ఎవ్వరు ఉండరు !

మెదక్‌, జనవరి 24 (ఇయ్యాల తెలంగాణ ) : నర్సాపూర్‌ లో బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సమ్మేళనంలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు పాల్గోన్నారు. రఘునందన్‌ రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసింది ప్రోటోకాల్‌ కోసం కాదు, ఫోటో కోసం కాదు. దీని వెనుక ఇంకో కాల్‌ ఉంది..పొద్దున ఫోన్‌ చేశారు. సాయంత్రం సీఎం అపాయింట్‌ మెంట్‌ దొరికింది.గెలిచిన  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సిఎంని  కలిశారో లేదో కానీ బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యేలు మాత్రం సిఎంని కలుస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌  పార్టీలో కేసీఆర్‌ కుటుంబసభ్యులు తప్ప ఎవ్వరు ఉండరు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ రెండే జాతీయ పార్టీలు ఉంటాయని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....