హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఇయ్యాల తెలంగాణ) : బిఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమం కుంటుపడిందని తెలంగాణ జన సమితి పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్ లక్ష్మీ అన్నారు. టిజేఎస్ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఆదేశాల మేరకు “బస్తీ సమస్యల సర్వే ” కార్యక్రమాన్ని రెండో రోజు నిర్వహించారు. నగరంలోని గోషామహల్, మాతావల్లి బస్తీ, బంగ్లాదేశ్, గాంధీ బయటక్, తదితర బస్తీలలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆర్ లక్ష్మీ మాట్లాడుతూ బిఆర్ఎస్ పాలనలో పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. జీవో నెంబర్ 58, 59 ప్రకారం నిరుపేదల ఇల్లు రిజిష్టేషన్లు జరగలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ లు మంజూరీ అయిన వాళ్లకి ఇప్పటీకి అందజేయలేదని అన్నారు. ప్రజలు కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకుంటాయని భరోసాతో ఉన్నారన్నారు. ప్రజా సమస్యల పై పోరాటాలు చేసిన తెలంగాణ జన సమితి పార్టీకి దగ్గరవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సక్కుబాయ్, గోషామహల్ ఇన్చార్జ్ రేఖా, ధూల్ పేట్ శాంతాభాయ్ నింబూవాల అమర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.