BSP చార్మినార్ నియోజక వర్గం అధ్యక్షునిగా రామ్ చరణ్ దాస్

 చార్మినార్, ఫిబ్రవరి 3 (ఇయ్యాల తెలంగాణ) : బహుజన్ సమాజ్ పార్టీ BSP చార్మినార్ నియోజక వర్గం అధ్యక్షులుగా రామ్ చరణ్ దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కో – ఆర్డినేటర్ ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ రామ్ చరణ్ పార్టీ కండువా వేసి పార్టీ లోకి స్వాగతించారు. గురువారం చరణ్ ను కండువా కప్పి పార్టీ చార్మినార్ అధ్యక్షులుగా నియమించారు. రామ్ చరణ్ గతంలో అనేక పత్రికల్లో సీనియర్ విలేకరి గా అనేక సేవలను అందించారు. దీంతో పాటు వివిధ ఎస్సీ , ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధికి వివిధ సంఘాలలో కీలక పాత్రను పోషించారు. ప్రస్తుతం బీఎస్పీ పార్టీ లో చేరిన రామ్ చరణ్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....