BSP జగిత్యాల అభ్యర్థిగా బల్కం మల్లేష్‌ యాదవ్‌

జగిత్యాల అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ); బీఎస్పీ పార్టీ జగిత్యాల అసెంబ్లీ అభ్యర్థిగా బల్కం మల్లేష్‌ యాదవ్‌ ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌. ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటించారు. సోమవారం హైద్రాబాద్‌ లో విడుదల చెందిన జాబితాలో బిసి సామాజికవర్గానికి చెందిన బల్కం మల్లేష్‌ యాదవ్‌ యాదవ సంఘ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ కుల, సామాజిక అంశాలపై నిరంతర పోరాటాలు చేసిన నేపద్యాన్ని గుర్తించి జగిత్యాల అభ్యర్థిగా ఎంపిక చేసినట్లుతెలిపారు. ఈ సందర్భంగా మల్లేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ నా అభ్యర్థిత్వానికి కృషిచేసిన జిల్లా ఇంచార్జ్‌ లు మద్దెల నారాయణ, చిర్ర శంకర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్‌ కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు దేవ్సింగ్‌ రాథోడ్‌ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....