CBI ప్రత్యేక కోర్టులో MLC కవితకు ఎదురుదెబ్బ !

 
జులై 5వరకు కస్టడీ పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ

న్యూ ఢిల్లీ, జూన్‌ 21 (ఇయ్యాల తెలంగాణ) :  సిబిఐ ప్రత్యేక కోర్టులో ఎంఎల్‌సి కవితకు ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్‌ పాలసీ సిబిఐ కేసులో కవితకు జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగించారు. నేటితో ఎంఎల్‌సి కవిత జ్యుడిషియల్‌ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. జులై 5వరకు కస్టడీ పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఢల్లీి మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను రౌస్‌ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు జూన్‌ 21వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. జూన్‌ 3న ఈడీ అధికారులు వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు కవిత జ్యుడీషియల్‌ కస్టడీని జూలై 3వ తేదీ వరకు పొడిగించిన విషయం విధితమే.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....