హైదరాబాద్ జులై 11 (ఇయ్యాల తెలంగాణ ); సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను లంగర్ హౌస్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం సాజిత్, సయ్యద్ హుస్సేన్, సయ్యద్ వాలిద్ హుస్సేన్ ఈ ముగ్గురు ఆటోను తీసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారని దొంగలించిన సెల్ ఫోన్ లను నిజామాబాద్ లోని సైయద్ రెహమతుల్లాకు అమ్ముతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు… వారి వద్ద నుండి సుమారు 30 సెల్ ఫోన్ లోనూ స్వాధీనం చేసుకున్నారు. ఒకరు ఆటో నడిపిస్తుంటే ఇద్దరు నిందితులు ఆటో వెనుకాల కూర్చుని వారు కూడా ప్యాసింజర్లల వ్యవహరిస్తూ మాయమాటలు చెప్పి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు…. మహమ్మద్ సాజిద్ కు రిసీవర్ జైల్లో పరిచయం అయినట్లు పోలీసులు తెలిపారు.
- Homepage
- Telangana News
- CELL PHONE దొంగల అరెస్టు
CELL PHONE దొంగల అరెస్టు
Leave a Comment