Central జైల్లో దర్శన్‌కు రాజభోగాలు

స్పందించిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య

పవిత్రను ట్రోలింగ్‌ చేస్తున్నాడనే కారణంతో అభిమాని రేణుకా స్వామిని దారుణంగా కొట్టి చంపిన కేసులో దర్శన్‌ అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. సెంట్రల్‌ జైల్లో దర్శన్ను ఉంచారు. దర్శన్‌ ఆరోగ్యం బాగా లేదని, ఇంటి నుంచి ఫుడ్‌ తెచ్చుకునేందుకు అనుమతిని ఇవ్వండని కోర్టుని కోరితే అందుకు ధర్మాసనం నిరాకరించింది. కానీ జైల్లో దర్శన్కు రాజ భోగాలు కల్పిస్తున్నారని ఓ ఫోటో ద్వారా లీక్‌ అయింది. హాయిగా అలా ఫ్రెండ్స్తో కూర్చుని.. కాఫీ తాగుతూ.. దమ్ము కొడుతూ చిల్‌ అవుతున్నట్టుగా జైల్లో చిల్‌ అవుతున్నాడు దర్శన్‌.

 ఇలా దర్శన్కు రాజభోగాలు కల్పించడంపై సోషల్‌ విూడియాలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ విషయంపై  కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. హత్యకేసులో నిందితుడిగా ఉన్న హీరో దర్శన్‌ కు పరప్పన అగ్రహార జైల్లో వీఐపీ ట్రీట్‌ మెంట్‌ ఇవ్వడంపై సీఎం సీరియస్‌ అయ్యారు. దర్శన్తోపాటు మరికొందరిని మరో జైలుకు తరలించాలని రాష్ట్ర పోలీసు కమిషనర్కు సూచించారు. అంతేకాకుండా దర్శన్‌ కు వీఐపీ ట్రీట్‌ మెంట్‌ అందించేందకు సహాకరించిన పోలీస్‌ సిబ్బందిని వెంటనే సస్పెండ్‌ చేయాలని సీఎం ఆదేశించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....