Charminar దగ్గర DJ లో అగ్ని ప్రమాదం !

చార్మినార్, సెప్టెంబర్ 19 (ఇయ్యాల తెలంగాణ) : మిలాద్ – ఉన్ – నబి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీలో చార్మినార్ దగ్గర డీజే లో ఉన్న టపాసుల కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని కొందరు ముస్లిం యువకులు తెలిపారు. 

దేవాలయానికి ఎలాంటి ప్రమాదం లేదు. 

మిలాద్ ఉన్ నబి వేడుకలను పురస్కరించుకొని జరిగిన అగ్ని ప్రమాదంలో కొందరు అల్లరి మూకలు భాగ్యలక్ష్మీ ఆలయం మంటల్లో చిక్కుకున్నట్లు ఓ వీడియోను వైరల్ చేశారు. దీంతో పాతనగరంలోని చాలా మందిలో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పాటు అందరూ ఫోన్లను చూసి ఒకేసారి షాకయ్యారు. కానీ అందరూ అనుకున్నట్లు ఎలాంటి ఇబ్బందులు లేవని దేవాలయం దగ్గర అంతా సురక్షితంగా ఉన్నట్లు దేవాలయ కమిటీ తెలిపింది.  దీనికి సంబంధించి కొద్దీ క్షణాల క్రితం భాగ్యలక్ష్మీ టెంపుల్ ట్రస్టీ దేవాలయ వీడియోను రిలీజ్ చేశారు. దేవాలయం కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నదని అనవసరంగా ఎవరూ ఉత్కంఠకు గురి కావద్దని ప్రకటించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....